NTR : కొంచెం నొప్పిగా ఉంది.. మా అమ్మమ్మ చెప్పిన కథలే ఈ సినిమా.. గాయంతోనే ఎన్టీఆర్ స్పీచ్..
రిషబ్ కోసం ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గాయంతోనే హాజరయ్యాడు. (NTR)

NTR
NTR : కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమాకు ప్రీక్వెల్ ప్రకటించగా అది ఇపుడు రాబోతుంది. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు.(NTR)
అయితే ఇటీవల ఓ యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు రెండు వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. కానీ రిషబ్ కోసం ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గాయంతోనే హాజరయ్యాడు. దీంతో తనకున్న నొప్పి గురించి కూడా మాట్లాడాడు ఎన్టీఆర్.
Also Read : Aakash Srinivas : OG లో పవన్ చిన్నప్పటి పాత్ర చేసింది ఇతనే.. అప్పుడు ప్రభాస్ కి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి..
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కొంచెం నొప్పిగా ఉంది. గట్టిగా మాట్లాడలేను. మీరు సైలెంట్ గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను. అర్ధం చేసుకోండి. నా వయసు నాలుగేళ్లు ఉన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి మా ఊరు ఇది కుందపురా దగ్గర అని చాలా కథలు చెప్పేది. అప్పుడు ఆ కథలు అర్ధం అయ్యేది కాదు. కానీ ఆ కథలు బాగుంటాయి. గుళిగా ఆట, పింజర్లి ఇవన్నీ చూడాలి అనుకునేవాడిని. కానీ ఏ రోజు నేను అనుకోలేదు వాటి మీద ఒక డైరెక్టర్ సినిమా తీస్తాడని. కానీ నా బ్రదర్ రిషబ్ శెట్టి తీసాడు.
నేను చిన్నప్పుడు విన్న కథలు స్క్రీన్ మీది చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. రిషబ్ శెట్టి వెరీ రేర్ బ్రీడ్ డైరెక్టర్, యాక్టర్. మా అమ్మకు ఎప్పట్నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణ టెంపుల్ కి వెళ్లాలని. రిషబ్ గారి వల్లే అది జరిగింది. మా కోసం వచ్చి గుళ్లకు తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించి సొంత బ్రదర్ లా చూసుకున్నాడు. మా అమ్మ కోరిక తీర్చినందుకు థ్యాంక్యూ రిషబ్. కాంతార చాప్టర్ 1 తీయడం ఈజీ కాదు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నా బ్రదర్ పడ్డ కష్టానికి ఫలితం అందించండి. ఇంకొంచెం సేపు మాట్లాడదాం అనుకున్నాను కాని ఎక్కువ సేపు నిల్చోలేకపోతున్నాను అని అన్నారు.
Also See : Ritika Nayak : గ్రీన్ పట్టుచీరలో మిరాయ్ భామ.. ఎంత క్యూట్ గా ఉందో..