NTR
NTR : ఎన్టీఆర్ ఇటీవల బాలీవుడ్ వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక యావరేజ్ గా నిలిచింది. కలెక్షన్స్ విషయంలో కూడా కేవలం 350 కోట్లు వచ్చాయని సమాచారం. ఇంకా అనేక చోట్ల వార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. తెలుగులో కూడా ఇదే పరిస్థితి.(NTR)
రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తున్నాడు, YRF స్పై యూనివర్స్ అంటూ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ రిలీజయ్యాక మొత్తం మారిపోయింది. YRF స్పై యూనివర్స్ సినిమాల్లోనే వీక్ సినిమా అని బాలీవుడ్ వాళ్ళే కామెంట్స్ చేసారు. గతంలోనే ఎన్టీఆర్ సోలో హీరోగా ఈ స్పై యూనివర్స్ లో సినిమా ఉంటుందని రూమర్స్ వచ్చాయి.
Also See : Anchor Ravi : ఫ్యామిలీతో కలిసి యాంకర్ రవి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో అందరి హీరోలతో సోలోగా, మల్టీస్టారర్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పటికే టైగర్, పఠాన్, వార్, వార్ 2.. ఇలా పలు సినిమాలు రాగా మరికొన్ని రెడీ అవుతున్నాయి. వీటిల్లో సోలో గా చేసిన హీరోలు వేరే సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తారు. ఎన్టీఆర్ వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. వార్ 2 సినిమా క్లైమాక్స్ లో దేశం కోసం ఒక టైగర్, ఒక పఠాన్, ఒక కబీర్ వచ్చినట్టే రేపు ఒక రాఘవ కూడా రావొచ్చు అనే డైలాగ్ ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాఘవ, ఏజెంట్ విక్రమ్ అనే పేర్లతో కనిపిస్తాడు.
దీంతో ఎన్టీఆర్ సోలోగా ఏజెంట్ విక్రమ్ అనే స్పై సినిమా కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ సోలోగా స్పై యూనివర్స్ లో సినిమా ఉంటుందని అని ఫ్యాన్స్ కూడా సంబర పడ్డారు. కానీ వార్ 2 ఫలితం తర్వాత నిర్మాణ సంస్థ ఏజెంట్ విక్రమ్ ప్రాజెక్టు ని క్యాన్సిల్ చేసిందని, ఈ మేరకు ఎన్టీఆర్ కి కూడా చెప్పగా ఓకే అన్నాడని బాలీవుడ్ సమాచారం. ఇకపై YRF స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ కి సంబంధం లేదని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తుంది.
Also See : Allu Ayaan Arha : తాతయ్యతో కలిసి వినాయక చవితి పూజ చేస్తున్న అల్లు అయాన్, అర్హ.. ఫొటోలు వైరల్..
అసలు వార్ 2 సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పాత్ర చనిపోవాలి. కానీ ఫ్యాన్స్ కోసం, ఏజెంట్ విక్రమ్ సినిమా లీడ్ కోసమే బతికిస్తారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా ఇండైరెక్ట్ గానే చెప్పాడు. దీంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ ని గ్రాండ్ గా ఊహించుకున్నాక ఇప్పుడు ఏజెంట్ విక్రమ్ సినిమా లేదు అనడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మరి ఫ్యూచర్ లో ఇంకెప్పుడైనా ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా చేస్తాడా? వేరే బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తాడా చూడాలి.