NTR
NTR : RRRతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత నుంచి అన్ని భారీ సినిమాలే చేస్తున్నాడు. ఇటీవల బాలీవుడ్ వార్ 2 సినిమాతో వచ్చినా ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అంతా కర్ణాటకలోనే జరుగుతుంది.(NTR)
కర్ణాటకలో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ కి కూడా కన్నడ మూలాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కన్నడలో కూడా అద్భుతంగా మాట్లాడతాడు. ఇప్పుడు డ్రాగన్ సినిమాతో కన్నడ వాళ్లకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో డ్రాగన్ సినిమాలో కన్నడ స్టార్ హీరో నటిస్తున్నాడట.
Also See : Kishkindhapuri : బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ.. ‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
కన్నడ స్టార్ హీరో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తాడని కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రిషబ్, ఎన్టీఆర్ కి మధ్య కూడా మంచి స్నేహం ఉంది. గతంలో ఇద్దరూ కలిసి పలుమార్లు కనిపించారు. ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి, టెంపుల్స్ కి వెళ్లారు. ప్రశాంత్ నీల్ అడగడంతో డ్రాగన్ సినిమాలో రిషబ్ గెస్ట్ రోల్ కి ఒప్పుకున్నాడని టాక్. దీంతో కన్నడలో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించినట్టే అని అనుకుంటున్నారు.
ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. అయితే ఇటీవల కాంతార చాప్టర్ 1 సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. దానిపై మూవీ యూనిట్ మాత్రం స్పందించలేదు. ఇదే నిజమైతే కనక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్. ఇలా ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ శెట్టి.. రిషబ్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారని కన్నడ మీడియా అంటుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఇక డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తోంది.
Also See : Anupama Parameswaran : ‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు..