NTR : ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ పోస్ట్.. ఇద్దరు ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తూ.. క్యూట్ ఫొటో..

తాజాగా ఎన్టీఆర్ తన పుట్టిన రోజు నాడు ఓ స్పెషల్ పోస్ట్ చేసారు.

  • Updated on- May 20, 2026 / 02:15 PM IST

NTR

NTR : నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు. తాజాగా ఎన్టీఆర్ తన పుట్టిన రోజు నాడు ఓ స్పెషల్ పోస్ట్ చేసారు.

ఎన్టీఆర్ రెండు పెద్ద చిలకలతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ చిలకల ఫొటోని కూడా షేర్ చేసారు. ఆ పక్షులతో ఎన్టీఆర్ దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. నా పక్షులను పరిచయం చేస్తున్నాను. వాటి పేర్లు అసహి, యూహి. జపాన్ పట్ల నాకున్న ప్రేమను ప్రతిబింబిస్తోంది అని పోస్ట్ చేసాడు.

Also See : Ntr Family Photos : నేడే ఎన్టీఆర్ పుట్టిన రోజు.. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?

RRR తో జపాన్ లో కూడా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కూడా జపాన్ కి రెండు మూడు సార్లు పర్యటనకు వెళ్లొచ్చారు. జపాన్ ఎన్టీఆర్ ఫేవరేట్ ప్లేస్ గా మారిపోయింది. ఇప్పుడు తన పెంపుడుకి చిలకలకు జపాన్ కి చెందిన పేర్లు పెట్టడం గమనార్హం. బర్త్ డే రోజు ఎన్టీఆర్ క్యూట్ ఫొటో షేర్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.