Manchu Manoj : మరోసారి మంచు మనోజ్ వర్సెస్ బాలయ్య.. అఫీషియల్ అనౌన్స్.. ఫ్యాన్స్ కి పండగే..
నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. (Manchu Manoj)
Manchu Manoj
Manchu Manoj : మంచు మనోజ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. మిరాయి సినిమాలో మెయిన్ విలన్ గా అదరగొట్టాడు మనోజ్. నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంలో NBK 111 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతం. ఈ సినిమాలో మనోజ్ నటించబోతున్నట్టు బర్త్ డే విశేష్ చెప్తూ అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ గోపీచంద్. మనోజ్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. మీ శక్తి మీ చుట్టూ ఉన్న ప్రతి ప్రదేశాన్ని ప్రకాశవంతం చేయడం ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తుంది. ముందు ముందు ఏం జరగబోతోందో చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను అని సినిమాపై, మనోజ్ పాత్రపై హైప్ పెంచారు.
Also Read : Rukmini Vasanth : ఎన్టీఆర్ డ్రాగన్ హీరోయిన్.. రుక్మిణి వసంత్ క్యూట్ ఫోటోలు..
దీంతో మనోజ్ వర్సెస్ బాలకృష్ణ అన్నట్టు ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి మనోజ్ బాలయ్య సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడా లేదా ఏదైనా కీలక పాత్రలో నటిస్తున్నాడా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. అయితే గతంలోనే బాలకృష్ణ – మనోజ్ కలిసి నటించారు. ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాలో మనోజ్ – బాలయ్య కలిసి నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఇద్దరి పర్ఫార్మెన్స్ లు మాత్రం అదిరిపోతాయి.
Happy Birthday dear @HeroManoj1 🤗
It’s always a delight to see your energy light up every place around you ❤️
Can’t wait to witness what’s in store with #NBK111 . pic.twitter.com/7P9mtnvDVh
— Gopichandh Malineni (@megopichand) May 20, 2026
