NTR surprised the reporter of Variety magazine with a birthday gift
NTR : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక ఇందులో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా మూవీ టీం గోల్డెన్ గ్లోబ్ అవార్డు పురస్కారాల్లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్నారు. ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ కి ప్రపంచ సినీ టెక్నిషన్స్ అందరు వస్తారు. దీంతో ప్రఖ్యాతి ఇంగ్లీష్ మ్యాగజైన్స్ కూడా అక్కడికి చేరుకుంటారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ‘వెరైటీ’ మ్యాగజైన్ మార్క్ మల్కిన్ విలేకరి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో రెడ్ కార్పెట్ ని హోస్ట్ చేసాడు. ఇక ఆ సమయంలో అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని ఈ మార్క్ ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఆ రోజు (జనవరి 11) మార్క్ మల్కిన్ బర్త్ డే అని తెలుసుకున్న తారక్.. ఇంటర్వ్యూ ఎండ్ లో అతనికి గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఆ విషయాన్ని మార్క్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘ఆర్ఆర్ఆర్ లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ నాకు ‘బో టై’ బహుమతిగా ఇచ్చాడు. థాంక్యూ ఎన్టీఆర్’ అంటూ పోస్ట్ చేశాడు.
కాగా ఈ వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ ప్రెడిక్షన్ లిస్ట్ లో ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ గా అవార్డుని అందుకొనే ఛాన్స్ ఉంది అంటూ ప్రచురించింది. ఇప్పటికే ఈ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ కింద ‘నాటు నాటు’ సాంగ్ నామినేషన్ లిస్ట్ లో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం ఎలిజిబుల్ లిస్ట్ లో బెస్ట్ మూవీగా RRR రేస్ లో నిలిచింది. జనవరి 12 నుంచి 17 వరకు ఈ ఎలిజిబుల్ లిస్ట్ కి ఓటింగ్ ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవనున్నాయి. ఆర్ఆర్ఆర్ నామినేషన్స్ లో నిలిచే అవకాశం చాలా ఉంది అంటున్నారు హాలీవుడ్ మీడియా ప్రతినిధులు.
So this happened! @tarak9999 brought me a birthday present to the carpet today! Ahhhhh!#GoldenGlobes @Variety @RRRMovie
Thank you, NTR Jr.! pic.twitter.com/uAYuyLbINk— Marc Malkin (@marcmalkin) January 11, 2023