NTR Vs Rajinikanth Ear 2 Vs Coolie Movie Clash
NTR Vs Rajinikanth : ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. ఇప్పటివరకు అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ తప్ప ఒక్క అప్డేట్ కూడా రాలేదు. వార్ 2 సినిమాని ఇండిపెండెన్స్ డే ముందు ఆగస్టు 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ సినిమా అవ్వడం, హృతిక్ తో కలిసి మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని, ఎన్టీఆర్ కెరీర్ లో RRR తర్వాత ఇంకో వెయ్యి కోట్ల సినిమా వస్తుందని ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు. అయితే తాజాగా ఆ సినిమాకు పోటీగా మరో భారీ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ చేస్తున్నారు.
రజినీకాంత్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, పూజ హెగ్డే, శృతిహాసన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. తాజాగా కూలి సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. కూలి సినిమా కూడా ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
తమిళ్ లో ఇప్పటివరకు ఏ సినిమా వెయ్యి కోట్లు సాధించలేదు. ఈ సినిమాపై అంచనాలు ఉండటం, తెలుగు, కన్నడ స్టార్ హీరోలు ఉండటం, రజినీకాంత్ జైలర్ తో ఫామ్ లో ఉండటంతో కూలి సినిమా వెయ్యి కోట్లు సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఎంతమంది హీరోలు ఉన్నా టాలీవుడ్ లో మాత్రం ఇప్పుడు వార్ ఎన్టీఆర్ వర్సెస్ రజినీకాంత్ అవుతుంది. మరి ఈ రెండు సినిమాలు చెప్పిన టైంకి వస్తాయా? ఎవరు వెయ్యి కోట్లు సాధిస్తారో చూడాలి.
Sound-ah yethu! 📢 Deva Varraaru🔥 #Coolie worldwide from August 14th 😎 @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/KU0rH8kBH7
— Sun Pictures (@sunpictures) April 4, 2025