Just A Minute : ‘జస్ట్ ఎ మినిట్’ మూవీ వాలెంటైన్స్ డే స్పెషల్.. ‘నువ్వంటే ఇష్టం’ సాంగ్ రిలీజ్..

వాలెంటైన్స్ డే సందర్భంగా 'జస్ట్ ఎ మినిట్' మూవీ నుంచి 'నువ్వంటే ఇష్టం' అనే మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.

Nuvvante Istam Video Song released from Just A Minute movie

Just A Minute : ప్రేమికులకు ఎంతో ఇష్టమైన రోజు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే వస్తుందంటే.. ప్రతి ఒక్కరు ఎన్నో స్పెషల్స్, గిఫ్ట్స్, సర్‌ప్రైజ్స్ ఎదురు చూస్తుంటారు. ఇక ఈ క్యూరియాసిటీని మూవీ మేకర్స్ కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రేమికుల రోజుకి తగ్గట్టు ప్రేమ కథలు, పాటలతో ఆడియన్స్ ముందుకు వస్తుంటారు. ఈక్రమంలోనే టాలీవుడ్ లో తెరకెక్కుతున్న కొత్త మూవీ.. ‘జస్ట్ ఎ మినిట్’ మేకర్స్ కూడా ఒక లవ్ సాంగ్ ని లవర్స్ కోసం తీసుకు వచ్చారు.

యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ మొదటి సాంగ్ రిలీజ్ అయ్యి మంచి స్పందని అందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ ని రిలీజ్ చేశారు. ‘నువ్వంటే ఇష్టం’ అంటూ సాగే మెలోడీ సాంగ్ కి ఎస్ కే బాజీ సంగీతం అందించారు. రామ్ గోశాల అందించిన లిరిక్స్ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఆ సాంగ్ ని మీరు కూడా వినేయండి.

Also read : Tom Cruise : నాలుగోసారి ప్రేమలో పడ్డ టామ్ క్రూజ్.. 61ఏళ్ళ వయసులో 36ఏళ్ళ అమ్మాయితో..

ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ.. “టీజర్‌కి, ఫస్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రావడం మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాము” అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ చిత్రాన్ని అర్షద్ తన్వీర్, డా. ప్రకాష్ ధర్మపురి రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.