Tom Cruise : నాలుగోసారి ప్రేమలో పడ్డ టామ్ క్రూజ్.. 61ఏళ్ళ వయసులో 36ఏళ్ళ అమ్మాయితో..
హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ నాలుగోసారి ప్రేమలో పడ్డారు. 61ఏళ్ళ వయసులో 36ఏళ్ళ అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టారు.

Hollywood star Tom Cruise Relationship with Russian socialite Elsina Khayrova
Tom Cruise : హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ గురించి తెలియని ఆడియన్స్ ఎవరు ఉండరు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఈ హీరోకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. 61ఏళ్ళ వయసు గల టామ్ క్రూజ్ 36ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో పడ్డారట. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రేమ విషయం గత ఏడాది డిసెంబర్ లో బయటికి వచ్చింది.
రష్యాకి చెందిన ప్రముఖ మోడల్ ‘ఎల్సినా ఖైరోవా’తో టామ్ క్రూజ్ ప్రేమలో పడ్డారట. ౨౦౨౩ డిసెంబర్ లో లండన్‌లోని మేఫెయిర్‌లో ఈ జంట కలిసి పార్టీలో పాల్గొన్నారు. అప్పటినుంచే వీరిద్దరి ప్రేమ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాదు ఈ జంట ఇటీవల లండన్ లోని ఎయిర్ అంబులెన్స్ ఛారిటీకి మద్దతు ఇచ్చే ఛారిటీ డిన్నర్‌లో కూడా కలిసి కనిపించారు. అలాగే లండన్‌లోని కొన్ని ప్రత్యేకమైన రెస్టారెంట్‌లలో డిన్నర్స్ చేస్తూ, ఎల్సినా ఇంటికి సమీపంలోని హైడ్ పార్క్‌లో జంటగా చక్కర్లు కొడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
Also read : Paarijatha Parvam : కిడ్నాప్ చేయడం ఒక ఆర్ట్.. దాని కోసం మనుషులు కావాలంటూ డైరెక్టర్ ప్రకటన..
ఇక తమ ప్రైవసీ దెబ్బతినకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకి రాకుండా టామ్ క్రూజ్ జాగ్రత్త పడుతున్నారట. కాగా హాలీవుడ్ మీడియాలో తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. టామ్ క్రూజ్, ఎల్సినాతో కలిసి తన అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియదు. కాగా టామ్ క్రూజ్ కి ఇప్పటికే మూడుసార్లు పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నారు.
1987 లో మిమీ రోజర్స్ ని వివాహం చేసుకున్న టామ్ క్రూజ్.. 1990 విడాకులు ఇచ్చారు. ఆ తరువాత నికోల్ కిడ్‌మాన్ తో కలిసి నడిచి.. 2001లో విడిపోయారు. 2006లో కేటీ హోమ్స్ తో రిలేషన్ మొదలుపెట్టిన టామ్ క్రూజ్.. 2012 ఆమెతో విడిపోయారు. ఇప్పుడు ఎల్సినా ఖైరోవాతో రిలేషన్ మొదలుపెట్టారు.
View this post on Instagram