Paarijatha Parvam : కిడ్నాప్ చేయడం ఒక ఆర్ట్.. దాని కోసం మనుషులు కావాలంటూ డైరెక్టర్ ప్రకటన..

కిడ్నాప్ చేయడం ఒక ఆర్ట్, కిడ్నాప్ చేసేందుకు కొందరు మనుషులు కావాలంటూ పేపర్ ప్రకటన ఇచ్చిన టాలీవుడ్ డైరెక్టర్.

Paarijatha Parvam : కిడ్నాప్ చేయడం ఒక ఆర్ట్.. దాని కోసం మనుషులు కావాలంటూ డైరెక్టర్ ప్రకటన..

Tollywood director Santosh crazy promotions for his new movie Paarijatha Parvam

Updated On : February 13, 2024 / 5:41 PM IST

Paarijatha Parvam : టాలీవుడ్ మేకర్స్ సినిమాలు తెరకెక్కించడంలోనే కాదు, వాటిని ప్రమోట్ చేయడంలో కూడా కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సినిమాలో కాన్సెప్ట్స్ కంటే ప్రమోషనల్ కాన్సెప్ట్స్ తోనే ఆడియన్స్ ని ఎక్కువ ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడు తన కొత్త సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ అందరి దృష్టి ఆకర్షిస్తుంది. కిడ్నాప్ చేయడం ఒక ఆర్ట్, కిడ్నాప్ చేసేందుకు కొందరు మనుషులు కావాలంటూ పేపర్ ప్రకటన ఇస్తున్నారు.

సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ డ్రామా మూవీ ‘పారిజాత పర్వం’. తెలుగు యువతని తన అందంతో మెస్మరైజ్ చేసే శ్రద్దా దాస్.. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సునీల్, చైతన్య రావు మదాది, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సమీర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కథ కిడ్నాప్ నేపథ్యంతో సాగుతుంది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కోసం కొత్తగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

Also read : Vyooham – Shapadham Trailer : వ్యూహం, శపథం ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..

‘కిడ్నాప్ చేయడం ఒక ఆర్ట్. ఎవరైనా ఇంటరెస్ట్ ఉంటే సంప్రదించండి’ అంటూ కొన్ని పేపర్ పాంప్లెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ పేపర్స్ పై ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అయితే ఆ క్యూఆర్ ని స్కాన్ చేసి చూస్తే.. అది టీజర్ లింక్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పేపర్ పాంప్లెట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్యూఆర్ ద్వారానే ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనేది తెలియాల్సి ఉంది. మహీధర్ రెడ్డి, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రీ’ సంగీతం అందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Santosh Kambhampati (@directorsanty)