Vyooham – Shapadham Trailer : వ్యూహం, శపథం ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’ ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి.

Vyooham – Shapadham Trailer : వ్యూహం, శపథం ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..

Ram Gopal Varma Vyooham Shapadham Trailers released

Updated On : February 13, 2024 / 5:07 PM IST

Vyooham – Shapadham Trailer : టాలీవుడ్ కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఏపీకి చెందిన ఇతర పొలిటిషన్స్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని అభ్యంతరకర విధంగా చూపించారని.. గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లడంతో.. రిలీజ్ ని వాయిదా వేస్తూ వచ్చారు.

గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాలు.. ఇప్పుడు అన్ని అడ్డంకులు తప్పించుకొని రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రాల్లోని మొదటి భాగం ‘వ్యూహం’.. ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతుంటే, సెకండ్ పార్ట్ ‘శపథం’.. మార్చి 1న రిలీజ్ కానుంది. కాగా ఆల్రెడీ వ్యూహంకి సంబంధించిన ట్రైలర్ ని గతంలోనే ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ సందర్భంగా మరో ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. వ్యూహం ట్రైలర్ తో పాటు శపథం ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. మరి ఆ ట్రైలర్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

Also read : Sai Dharam Tej : స్టూడెంట్స్‌ని రిక్వెస్ట్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ పిలుపు.. ఎందుకోసమో తెలుసా?

రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీఎం జగన్ పాత్రలో ‘అజ్మల్ అమీర్’, వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృషన్ నటిస్తున్నారు. ఈ పాత్రలతో పాటు మూవీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి పాత్రలు, మరికొంతమంది రాజకీయ నాయకుల పాత్రలు కూడా కనిపించబోతున్నాయి.