Sai Dharam Tej : స్టూడెంట్స్‌ని రిక్వెస్ట్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ పిలుపు.. ఎందుకోసమో తెలుసా?

సాయి ధరమ్ తేజ్ రోడ్డు భద్రతపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టూడెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.. ఏం రిక్వెస్ట్ చేసారంటే?

Sai Dharam Tej : స్టూడెంట్స్‌ని రిక్వెస్ట్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ పిలుపు.. ఎందుకోసమో తెలుసా?

Sai Dharam Tej

Updated On : February 13, 2024 / 4:30 PM IST

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రహదారి భద్రతపై హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాహనాలు డ్రైవ్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్ధులకు సూచనలు చేసారు.

Anveshi Jain : తెలుగు నేర్చుకుంటున్న అందాల భామ.. ముద్దుముద్దుగా మాట్లాడుతున్న వీడియో వైరల్..

సాయి ధరమ్ తేజ్ బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. రిపబ్లిక్, విరూపాక్ష, బ్రో సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ సంపత్ నందితో ‘గాంజా శంకర్’ సినిమా చేస్తున్నారు. మరో కొత్త డైరెక్టర్‌తో కూడా సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. అనౌన్స్ అవ్వలేదు. కాగా సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్ పోలీసులు సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీలో నిర్వహించిన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించమని.. మద్యం సేవించి వాహనం నడపొద్దని రిక్వెస్ట్ చేసారు.

Ranveer Singh : బాబోయ్ ఇదేమి యాడ్ రా.. జానీ సిన్స్‌తో కలిసిన రణవీర్.. దేనికోసమో తెలుసా..!

2021 లో బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనేక శస్త్ర చికిత్సల అనంతరం ప్రమాదం నుంచి కోలుకుని అదే సంవత్సరం అక్టోబర్ 15న ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చారు. చాలా రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆ ఘటన నుండి కోలుకున్నాక తిరిగి షూటింగ్‌లతో బిజీ అయ్యారు. ప్రస్తుతం మంచి  బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ మెగా హీరో.