Site icon 10TV Telugu

Nuvve Nuvve Movie Re Release: హీరో తరుణ్ సూపర్ హిట్ మూవీ “నువ్వే నువ్వే” రీ రిలీజ్..

Nuvve Nuvve Movie Re Release

Nuvve Nuvve Movie Re Release

Nuvve Nuvve Movie Re Release: రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్.. “నువ్వే నువ్వే” సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకొని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. లవర్ బాయ్ తరుణ్, శ్రియ శరణ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2002 అక్టోబర్ 10న విడుదలై సూపర్ హిట్టును టాక్ కు సొంతం చేసుకుంది.

Varsham Movie Re Release: రెండు రోజులు జరుగనున్న ప్రభాస్ బర్త్ డే.. వర్షం మూవీ రీ రిలీజ్!

ఇదిలా ఉంటే, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తీ చేసుకోవడంతో, ఈ చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన స్పెషల్ స్క్రీనింగ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

స్రవంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన నువ్వే నువ్వే చిత్రంలో ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సునీల్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కోటి స్వరపరిచిన సంగీతం అప్పట్లో సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Exit mobile version