ఓ పిట్ట కథ – రివ్యూ

విశ్వంత్, నిత్యా శెట్టి, సంజయ్ రావు నటించిన ‘ఓ పిట్ట కథ’ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : March 6, 2020 / 10:21 AM IST
ఓ పిట్ట కథ – రివ్యూ

Updated On : March 6, 2020 / 10:21 AM IST

విశ్వంత్, నిత్యా శెట్టి, సంజయ్ రావు నటించిన ‘ఓ పిట్ట కథ’ రివ్యూ..

సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా.. ‘ఓ పిట్ట కథ’.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి బ్రహ్మాజీ తన తరపునుంచి చేయాల్సినదంతా చేసాడు. సూపర్ స్టార్స్‌ను రంగంలోకి దించాడు. మెగాస్టార్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రప్పించాడు. మొత్తానికి ఈ చిత్రంపై బజ్ తీసుకురాగలిగాడు. మరి ట్రైలర్‌తో ప్రామిసింగ్ అనిపించుకున్న ఈ సినిమా ఎంత వరకు ఆడియన్స్‌ను ఆకట్టుకుందో చూద్దాం. 
కథ :
కాకినాడలో ఉండే వీర్రాజు దగ్గరకు తన మేనల్లుడిని అంటూ.. చైనా నుంచి వస్తాడు క్రిష్. వీర్రాజు కుమార్తె వెంకట లక్ష్మిని ప్రేమిస్తున్నాను అంటూ.. వీర్రాజుకి చెప్తాడు. వీర్రాజు కూడా వీళ్ళిద్దరి పెళ్ళికి ఓకే అంటాడు. ఫ్రెండ్స్‌తోటి అరకు బయలుదేరిన వెంకటలక్ష్మి కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ అయిన విషయం వీర్రాజు, క్రిష్ కలిసి పోలీసులకు కంప్లైట్ ఇస్తారు. ఎస్సై అశోక్ కుమార్‌కు వీర్రాజు దగ్గర పనిచేసే ప్రభు మీద అనుమానం ఉందని క్రిష్ చెప్తాడు. ఆ దిశగా ఎంక్వైరీ మొదలు పెట్టిన ఎస్సైకి ఈ కేసుకు సంబంధించిన వీడియో దొరకుతుంది. ఆ వీడియోలో ఉన్నది ఏంటి..? అసలు వెంకటలక్ష్మీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ప్రభుకి ఏమోచ్చింది..? వెంకటలక్ష్మి దొరికిందా లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే.. 

నటీనటులు :
విశ్వాంత్ తన హ్యాండ్సమ్ లుక్‌తో క్రిష్ క్యారెక్టర్‌లో అందరిని మెప్పించాడు. డైలాగ్ డెలివరీలో లవర్ బాయ్‌గా క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ తనయుడు సంజీవ్ ఫస్ట్ సినిమా అయినా.. మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో.. ప్రభు పాత్రలో ఒదిగిపోయాడు. డైలాగ్ డెలివరీతో.. బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించాడు. వెంకటలక్ష్మీ పాత్రలో నటించిన నిత్యా శెట్టి బ్యూటిఫుల్ లుక్స్‌తో.. ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక బ్రహ్మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన సీనియార్టీకి తగ్గ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మిగతా నటీనటులు తమ పాత్రలప పరిధిమేర మెప్పించారు. 
టెక్నీషియన్స్ :
డైరెక్టర్ చందు ముద్దు చక్కటి కథను అల్లుకుని.. పకడ్బందీ స్క్రీన్ ప్లే తో ప్రతీ సన్నీవేశాన్ని హృదయానికి హత్తుకునేలా మలిచిన తీరు చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్.. ట్విస్ట్స్.. ఆడియన్స్‌ను అలరిస్తాయి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా అతను ఎన్నుకున్న పాయింట్ పాతదే అయినా.. ఆ మూడు పాత్రల మధ్య జరిగే సంఘటనలను అద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. ప్రవీణ్ లక్కరాజు సంగీతం పాటల పరంగానే కాకుండా.. ఆర్‌ఆర్ పరంగా కూడా మెప్పించింది. సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు.. కోనసీమ అందాలను అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. 

ఓవరాల్‌గా చెప్పాలంటే :
ఈ మధ్య కాలంలో ఒక చిన్నసినిమాగా మొదలై.. ట్రైలర్స్‌తో సాంగ్స్‌తోటి ఒక పెద్ద సినిమా రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసుకున్న ‘ఓ పిట్ట కథ సినిమా’.. ఫస్ట్ హాఫ్ సో సో గా ఉన్నా.. సెకండ్ హాఫ్‌లో ఆడియన్స్‌ను థ్రిల్‌కి గురిచేసే ఎలిమెంట్స్ ఉండటంతో.. సినిమా ఓవరా‌ల్‌గా అందరిని మెప్పిస్తుంది. 

ప్లస్ పాయింట్స్: 

స్టోరీ, స్క్రీన్ ప్లే… 
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్ 
ప్రొడక్షన్ వాల్యూస్ 

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ 
రియాలిటీ లేని కొన్ని సీన్స్ 
స్లో నెరేషన్.. 
(పలాస 1978 – రివ్యూ)