ప్రభు, క్రిష్ ఇద్దరిలో వెంకటలక్ష్మికి ఎవరంటే ఇష్టం?

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ‘ఓ..పిట్టకథ’ టీజర్.. మార్చి 6న గ్రాండ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 8, 2020 / 05:27 AM IST
ప్రభు, క్రిష్ ఇద్దరిలో వెంకటలక్ష్మికి ఎవరంటే ఇష్టం?

Updated On : February 8, 2020 / 5:27 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ‘ఓ..పిట్టకథ’ టీజర్.. మార్చి 6న గ్రాండ్ రిలీజ్..

విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, ప్రధాన పాత్రధారులుగా చెందు ముద్దు దర్శకత్వంలో, భవ్య క్రియేషన్స్ పతాకంపై  వి.ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా.. ‘ఓ..పిట్టకథ’.. ఇటీవల మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ టైటిల్‌పోస్టర్‌ విడుదల చేశారు. క్యారెక్టర్స్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు.

ప్రీ-టీజర్ రానా దగ్గుబాటి విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఓ..పిట్టకథ’ టీజర్ రిలీజ్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియచేశారు. కథ చెప్తే కానీ నిద్రపోని పాపకి తండ్రి కథ చెప్పబోతుంటే.. పాపే తండ్రికి కథ చెప్పడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, సస్పెన్స్ వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. హీరోలు, హీరోయిన్ ఫేసెస్ ఫ్రెష్‌గా కళగా ఉన్నాయి. దర్శకుడు చెందు ముద్దు ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంటాడనిపిస్తోంది.

Read Also : కబడ్డీ కోచ్ ‘జ్వాలా రెడ్డి’గా మిల్కీబ్యూటీ

O Pitta Katha

విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ఓ..పిట్టకథ’ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయనున్నారు. బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు : శ్రీజో, ఆర్ట్ : వివేక్‌ అన్నామలై, ఎడిటర్‌ : డి.వెంకటప్రభు, కెమెరా : సునీల్‌కుమార్‌, సంగీతం : ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : అన్నే రవి, నిర్మాత : వి.ఆనంద ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.