Jadi : ఒడియా హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులో.. ‘జడి’ గ్లింప్స్..
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు గ్లింప్స్ రిలీజ్ చేశారు. (Jadi)
- Saketh U
- Published on- October 26, 2026 / 02:40 PM IST
Jadi
Jadi : ఇన్నాళ్లు తమిళ్, హిందీ, మలయాళంలో హిట్ అయిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ అయ్యేవి.. ఇప్పుడు ఒడియాలో హిట్ అయిన సినిమా తెలుగులోకి రాబోతుంది. ఒడియాలో బ్లాక్ బస్టర్ సాధించిన ‘జడి’ సినిమా ఇప్పుడు తెలుగులోకి రానుంది. The Untold Side of IF అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. శ్రీయాన్ష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాజల్ రే నిర్మాణంలో దిబ్య జ్యోతి ఉదయ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా మెయిన్ లీడ్స్ లో నటించగా సుశాంత్ దాస్ మహాపాత్ర, రబి మిశ్రా, బాలకృష్ణ నాయక్, కృష్ణ రౌత్.. పలువురు ఒరిస్సా నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.
క్రైమ్ లవ్ కామెడీగా తెరకెక్కిన ఈ జడి సినిమాని మెగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కాలేజీ యువకుల మధ్య స్నేహం, ఓ ప్రేమకథ, స్నేహితుల మధ్య తలెత్తే విభేదాలు, ప్రేమకథకు మించి జీవితంలోని భావోద్వేగాలు, బంధాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తుంది.
Also See : Srinidhi Shetty : జీన్స్, టీ షర్టు.. శ్రీనిధి శెట్టి లేటెస్టు ఫోటోలు.. వైరల్
దర్శకుడు దిబ్య జ్యోతి ఉదయ సింగ్ గ్రామీణ వాతావరణం, యువత స్నేహాలు, ప్రేమ, సంఘర్షణలను సహజంగా తెరపై ఆవిష్కరించినట్టు తెలుస్తుంది. రుద్రకాంత సింగ్ సినిమాటోగ్రఫీ గ్రామీణ అందాలను తన విజువల్స్ లో అద్భుతంగా చూపించాడు. తెలుగు రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. మరి ఒడియాలో హిట్ అయిన జడి తెలుగులో ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం సన్నివేశాలు, సంగీతంతో సాగిన జడి గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..
