Shah Rukh Khan : ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అధికారి.. షారుఖ్ ఖాన్ నుంచి లంచం తీసుకున్నాడు!

డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ని అరెస్ట్ చేసిన మాజీ యాంటీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడే అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసందే. తాజాగా..

Shah Rukh Khan Son Aryan Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఆ న్యూస్ అప్పటిలో దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. తాజాగా ఈ కేసు మరోసారి హెడ్ లైన్స్ లోకి ఎక్కింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌ని అరెస్ట్ చేసిన మాజీ యాంటీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడే అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసందే. ఇక దాని పై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని రెడీ చేసింది.

The Kerala Story : వెస్ట్ బెంగాల్‌లో కేరళ స్టోరీ నిషేధం పై సుప్రీమ్ కోర్టు స్టే.. తమిళనాడు ప్రభుత్వానికి..

ఆ రిపోర్ట్ లో సమీర్ వాంఖడే.. మరికొందరితో కలిసి షారుఖ్ ఖాన్ నుంచి 25 కోట్ల లంచం డిమాండ్ చేశారని, లేకుంటే ఆర్యన్ ఖాన్‌ను ఆరోపించిన డ్రగ్ కేసులో ఇరికిస్తామని బెదిరించారని నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తుంది. నిజానికి ఆర్యన్ ఖాన్ మరియు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ పేర్లను చివరి క్షణంలో జోడించారని, అసలు అనుమానితుల పేర్లను తొలిగించారని, దాడి సమయంలో ఆ అనుమానితుడి నుంచి రోలింగ్ పేపర్ రికవరీ అయినప్పటికీ అతడు వెళ్ళడానికి అనుమతించినట్లు.. విజిలెన్స్ విభాగం నివేదిక సూచిస్తుంది.

Shah Rukh Khan : అభిమానిని నెట్టేసిన షారుఖ్.. వీడియో వైరల్!

ఇది ఇలా ఉంటే ఈ ఐదేళ్లలో సమీర్ వాంఖడే తన కుటుంబంతో కలిసి దక్షిణాఫ్రికా, UK, ఐర్లాండ్, పోర్చుగల్, మాల్దీవ్స్ కు వెళ్లాడని, సుమారు 55 రోజులు పాటు అతను అక్కడ ఉన్నాడని నివేదికలో పేర్కొంది. అయితే ఈ మొత్తానికి అయిన ఖర్చు కేవలం 8.75 లక్షలు మాత్రమే అన్నట్లు వాంఖడే చూపిస్తున్నారు. అయితే విమాన ప్రయాణ ఖర్చుకే 8.75 లక్షలు అవుతుందని నివేదికలో చెప్పుకొచ్చారు. అలాగే తన దగ్గర ఉన్న రోలెక్స్ వాచ్‌, ముంబైలో నాలుగు ఫ్లాట్లు, వాషిమ్‌లో 41,688 ఎకరాల భూమి.. తదితర ఆస్తులకు కూడా సరైన అధరాలు లేవని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు