OG First Ticket Auction : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. OG సినిమా సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది.(OG First Ticket Auction)
ఇప్పటికే నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేయగా బుకింగ్స్ అదరగొడుతున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ 800K డాలర్స్ పైగా కలెక్ట్ చేసి అమెరికాలో సరికొత్త రికార్డ్ సృష్టించింది OG సినిమా. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు 1 మిలియన్ డాలర్స్ టార్గెట్ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.
Also See : Pawan Kalyan Rare Photos : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ రేర్ ఫొటోలు చూశారా..?
స్టార్ హీరోల సినిమాలకు, అది కూడా బెనిఫిట్ షోలు, మొదటి షోలకు టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయని తెలిసిందే. కొన్ని చోట్ల బ్లాక్ లో కూడా భారీ ధరకు అమ్ముతారు. అయితే OG నైజాం ఫస్ట్ టికెట్ ని వేలం పాట వేయడంతో భారీ ధరకు అమ్ముడయింది.
తాజాగా పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో స్పేస్ నిర్వహించగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా ఫ్యాన్స్ కూడా చాలా మంది పాల్గొన్నారు. ఈ స్పేస్ లో నైజాం ఏరియా OG ఫస్ట్ టికెట్ ని వేలం పాట వేశారు. ఈ టికెట్ ఏకంగా 5 లక్షలకు పాడుకున్నారు. ఈ టికెట్ ని నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీమ్ కొనుక్కుంది. ఆ 5 లక్షలను జనసేన పార్టీ ఫండ్ గా ఇస్తామని ప్రకటించారు. మూడు రోజుల్లో ఆ డబ్బుని పార్టీకి అందచేస్తామని తెలిపారు.
Congratulations @PowerStorm21 donating 5L to @JanaSenaParty 🙌🙌❤️💙 pic.twitter.com/N3w1RxednJ
— రాG🌸 OG gadi pilla😎❣️ (@RGNithya_pspk) September 1, 2025
దీంతో OG ఫస్ట్ టికెట్ ఆక్షన్ అని ట్విట్టర్ లో ట్రెండ్ కూడా అవుతుంది. వామ్మో ఒక్క టికెట్ ని 5 లక్షలుపెట్టి కొన్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ఆ డబ్బులన్నీ జనసేన పార్టీకి వెళ్తాయి కాబట్టి పవన్ మీద అభిమానం తో, OG మీద ఉన్న హైప్ తోనే ఈ రేంజ్ లో కొనుక్కున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.