Oh Movie Review
Oh Movie Review: హీరోగా రఘు రామ్ పరిచయం అవుతూ, తానే సొంతగా కథ అందించిన సినిమా ఓహ్. ఏకరి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిశెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా నటించారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో.. కింది స్థాయి వాళ్ళుకు అర్ధం కాదు… పై స్థాయి వాళ్లకు మాత్రమే… అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నేడు(డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? కథ ఏంటి? ఆడియన్స్(Oh Movie Review) ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
హీరో కృష్ణ (రఘురామ్), కావ్య(శృతి శెట్టి) అనే అమ్మాయిని తొలి చూపులోనే గాఢంగా ప్రేమిస్తాడు. అయితే, హీరోకి ‘క్రోమోఫోబియా’ (Chromophobia) అనే వింత సమస్య ఉంటుంది. ఆ కారణంగా అప్పటికే దృశ్య(నైనా) అనే మరో అమ్మాయితో ఉన్న బంధాన్ని గుర్తుంచుకోలేకపోతాడు. ఒకవైపు జ్ఞాపకాలు లేని గతం, మరోవైపు ప్రాణమైన ప్రస్తుత ప్రేమ. ఈ రెండింటి మధ్య కృష్ణ సంఘర్షణకి లోనవుతాడు. ఆ సమస్యను భారతీయ పురాణాలు, ప్రాచీన విజ్ఞానాన్ని ఉపయోగించి ఎలా అధిగమించాడు అనేది మిగిలిన కథ.
నటీనటులు:
కృష్ణ పాత్రలో రఘు రామ్ ఒదిగిపోయాడు. ఇద్దరు అమ్మయిల మధ్య గందరగోళానికి గురయ్యే యువకుడిగా, ప్రేమికుడిగా తన నటనతో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ సైతం అద్భుతంగా పండించాడు. ఇక శృతి శెట్టి, నైనా పాఠక్ ఇద్దరూ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ముఖ్యంగా సెంటిమెంట్, రొమాంటిక్ సన్నివేశాల్లో వీరి నటన ఆకట్టుకుంటుంది.
సాంకేతికనిపుణులు:
ఈ కథకు కెమెరా వర్క్ అనే చెప్పాలి. కథ బ్యాక్ గ్రౌండ్ మనాలిలో జరగడం వల్ల అక్కడి అందాలను అద్భుతంగా చూపించారు. మంచుపర్వతాలు, నదులు, దట్టమైన అడవుల దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక నవనీత్ చారి అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పాటలు ఒకే కానీ, బీజీఎమ్ సినిమాను నిలబెట్టింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడాల్సింది అనిపిస్తుంది. చాలా సన్నివేశాలను ఇంకా షార్ప్ గా కట్ చేస్తే మంచి ఫీల్ ఉండేది. ఏకరి ఫిల్మ్స్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడ కూడా రాజీ పడకుండా క్వాలిటీగా నిర్మించారు. ఇక దర్శకుడు ఏకరి సత్యనారాయణ తన టాలెంట్ ని పూర్తిగా చూపించుకున్నాడు. హీరో రఘు రామ్ రాసిన కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా ఎంచుకున్న పాయింట్ చాలా వైవిధ్యంగా ఉంది. సైన్స్‌ను – మన ప్రాచీన విజ్ఞానాన్ని మేళవించి కథను నడిపించిన తీరు అభినందనీయం.
ఓవరాల్ గా ‘ఓహ్’ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. యువతకే కాదు మన సంస్కృతిని, విజ్ఞానాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రేటింగ్ 2.75/5 ఇవ్వొచ్చు.