Chinmayi: ఈ మృగాలను ఏం చేయాలంటే.. నిధి అగర్వాల్ ఇష్యు పై చిన్మయి సంచలన కామెంట్స్
స్టార్ బ్యూటీ నిధి అగర్వాల్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ ఘటనపై సింగర్ చిన్మయి(Chinmayi) స్పందించారు.
Singer Chinmayi made sensational comments on the Nidhi Agarwal incident.
Chinmayi: స్టార్ బ్యూటీ నిధి అగర్వాల్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ ఈవెంట్ కోసం వచ్చిన జనాలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను తాకుతూ, నెట్టేస్తూ కనిపించిన ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ‘సహాన.. సహన’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. దీనికి సంబదించిన ఈవెంట్ హైదరాబాద్ లోని లూలూ మాల్ లో జరిగింది. దీంతో ఆ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు అక్కడకు చేరుకున్నారు.
Rakesh Bedi: స్టేజిపై అందరిముందే హీరోయిన్ కి ముద్దు.. నెట్టింట దుమారం.. ఆ నటుడు ఏమ్మన్నాడో తెలుసా?
ఇక వేడుక అనంతరం స్టేజిపై నుంచి వెళ్లిపోతున్నా నిధి వైపు ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. బౌన్సర్లు సైతం ఆ జనాలను ఆపలేకపోయారు. దీంతో, ఒక్కసారిగా జనాలు అంతా ఆమెపై పడిపోయి అసభ్యంగా ప్రవర్తించారు. కొంతమంది ఆమెను తాకుతూ, లాగుతూ, నెడుతూ సైకోలా ప్రవర్తించారు. వాళ్లందరినీ ఎలాగోలా తప్పించుకొని కారులోకి ఎక్కేసి హమ్మయ్య అనుకుంది నిధి. దీనికి సంబందించిన దారుణమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిధికి జరిగిన ఈ ఘటనపై సింగర్ చిన్మయి(Chinmayi) స్పందించారు.
వీళ్ళు మగాళ్లు కాదు, జంతువుల కంటే దారుణంగా ప్రవర్తించే మృగాలు. ఇలాంటి మృగాలను ఈ గ్రహం మీద ఉంచకూడదు.. వేరే గ్రహానికి పంపేయాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఇలా హీరోయిన్లను వేధించడం అమానవీయం. సెలబ్రిటీల కూడా ఒక ప్రైవసీ ఉంటుంది. వారిని గౌరవించడం నేర్చుకోవాలి” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
