MissTerious Review : ‘మిస్టీరియస్’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ ట్విస్టులు మాములుగా లేవుగా..

ప్రమోషన్స్ కి బ్రహ్మానందం రావడం, ట్రైలర్ ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (MissTerious Review)

MissTerious Review : ‘మిస్టీరియస్’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ ట్విస్టులు మాములుగా లేవుగా..

MissTerious Review

Updated On : December 19, 2025 / 8:41 AM IST

MissTerious Review : రోహిత్, అబిద్ భూషణ్‌, రియా కపూర్, మేఘనా రాజ్ పుత్, బాల రజ్వాది.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మిస్టీరియస్’. అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మాణంలో మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు డిసెంబర్ 19న థియేటర్స్ లో రిలీజయింది. ముందు రోజే ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేశారు.(MissTerious Review)

కథ విషయానికొస్తే.. రాంకీ(అబిద్ భూషణ్) ఒక పోలీస్ ఆఫీసర్. అనుకోకుండా 15 రోజుల నుంచి మిస్ అవుతాడు. ఈ కేసు ACP ఆనంద్ సాయి(బాల రజ్వాది)కి వస్తుంది. ఆనంద్ సాయి ఈ కేసుని టేకప్ చేసి విచారణ మొదలుపెడతాడు. ఈ విచారణలో రాంకీ కనిపించకుండా వెళ్లే ముందు ఇల్లీగల్ గా ఒక గన్ కొన్నాడని తెలుస్తుంది. అలాగే రాంకీ చివరి కాల్ శిల్ప(మేఘన రాజ్ పుత్)కి ఉందని తెలిసి, రాంకీ చివరగా శిల్ప ఇంటికి వెళ్లినట్టు సిసిటివి ఫుటేజ్ ఉండటంతో ఆమెని విచారిస్తారు.

కానీ శిల్ప, అతని భర్త విరాట్(రోహిత్) అదే సమయంలో గోవాలో యాక్సిడెంట్ కి గురవుతారు. దీంతో పోలీసులు షాక్ అయి మరోసారి శిల్ప ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ ఉండరు. అసలు శిల్ప – విరాట్ ఎవరు? వాళ్లకు, రాంకీ కి సంబంధం ఏంటి? అసలు రాంకీ ఏమయ్యాడు? రాంకీ ఇల్లీగల్ గా గన్ ఎందుకు కొన్నాడు? శిల్ప గోవాలో ఉంటే పోలీసులతో మాట్లాడిన అమ్మాయి ఎవరు? పోలీసులు ఈ కేసుని ఛేదించి రాంకీ ఏమయ్యాడో కనిపెట్టారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also See : Champion Trailer Launch : ‘ఛాంపియన్’ ట్రైలర్ లాంచ్ ఫొటోలు.. తమ్ముడు కోసం వచ్చిన చరణ్..

సినిమా విశ్లేషణ..

ఫేమ్ ఉన్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో మొదట ఈ సినిమా ఎవరికీ తెలీదు. కానీ ప్రమోషన్స్ కి బ్రహ్మానందం రావడం, ట్రైలర్ ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని పోస్టర్స్, ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. సినిమా అంతా ఎక్కువగా విచారణ, విచారణలో ఏం జరిగింది అంటూ ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతోనే సాగుతుంది. దీంతో అక్కడక్కడా విచారణ మరీ ల్యాగ్ అయింది అనిపిస్తుంది.

అయితే మొదట్నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొల్పారు. ఫస్ట్ హాఫ్ రాంకీ మిస్సింగ్, అతని కోసం విచారణ, అందులోకి శిల్ప – విరాట్ లు రావడం, ఇంకా పలువురిని విచారించడంతో సాగుతుంది. ఇంటర్వెల్ ఎలాంటి బ్యాంగ్ లేకుండా సింపుల్ గా ఇచ్చేస్తారు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే నడుస్తుంది. ఒక్కొక్కటి ట్విస్ట్ రివీల్ అవుతూ ఆసక్తిగా కథనాన్ని నడిపించారు. కథ సీరియస్ గా సాగుతుంటే మధ్యలో రెండు పాటలు, ఫ్లాష్ బ్యాక్ కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా సెకండ్ హాఫ్ మొదలయిన కొద్దిసేపటికే వచ్చే సీన్స్, సినిమా ఓపెనింగ్ లో చూపించిన సీన్ తో ఆ ట్విస్ట్, కథ ఊహించేయొచ్చు.

ఈ సినిమాని ఇంకాస్త జనాల్లోకి తీసుకెళ్లి, ఎడిటింగ్ లో కొంత ల్యాగ్ కట్ చేస్తే సినిమా బాగానే వర్కౌట్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు సెకండ్ హాఫ్ లో ఊహించని కథాంశంతో బాగానే తెరకెక్కించారు.

MissTerious Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

రోహిత్, అబిద్ భూషణ్ మెయిన్ లీడ్స్ లో బాగానే మెప్పించారు. మేఘన రాజ్ పుత్, రియా కపూర్ ఓ పక్క అందాలు ఆరబోస్తూనే, ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ లో నటనతో మెప్పించారు. పోలీస్ పాత్రలో నటించిన బాల రజ్వాది, లక్ష్మీ శ్రీదేవి పర్ఫెక్ట్ గా ఆ పాత్రల్లో సెట్ అయ్యారు. జబర్దస్త్ రాజమౌళి నటన కాస్త ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. గడ్డం నవీన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also See : Jyothi Labala : బిగ్ బాస్ ఫేమ్, నటి జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. సాంగ్స్ వినడానికి పర్వాలేదు అనిపించినా విజువల్ గా బాగా చూపించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథని ఇంకొన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి బాగానే రాసుకున్నాడు దర్శకుడు. ఎడిటింగ్ పరంగా ల్యాగ్ అనిపించిన కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా మిస్టీరియస్ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఊహించని ట్విస్టులతో సాగే సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.