Kissik Song : దెబ్బలు పడతయిరో.. కిస్సిక్ అంటున్న బామ్మలు.. పుష్ప 2 సాంగ్ కి బామ్మల స్టెప్స్ చూశారా?
అమ్మాయిలు రీల్స్ చేయడం మాములే కానీ బామ్మలు కూడా ఈ పాటకు రీల్స్ చేసారు.

Old age People Dance Steps for Pushpa 2 Sreeleela Kissik Song Reel goes Viral
Kissik Song : పుష్ప 2 సినిమా ఓ రేంజ్ లో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చింది. సినిమా కంటే ముందు సాంగ్స్ కూడా బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 1 సినిమాలో కూడా సాంగ్స్ బాగా హిట్ అయి వరల్డ్ వైడ్ పుష్ప కు ఫేమ్ తెచ్చింది. పుష్ప 1లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా ఊ ఊ అంటావా.. పాట ఏ రేంజ్ లో వైరల్ అయిందో ఇప్పుడు పుష్ప 2 సినిమాలో శ్రీలీల చేసిన కిస్సిక్.. స్పెషల్ సాంగ్ వైరల్ అవుతుంది.
దెబ్బలు పడతయిరో.. అంటూ శ్రీలీల కిస్సిక్ స్టెప్పులు థియేటర్స్ లో కుర్రకారుని హీట్ ఎక్కిస్తున్నాయి. ఇక ఈ పాటకి సోషల్ మీడియాలో రీల్స్ కూడా తెగ చేస్తున్నారు. అమ్మాయిలు రీల్స్ చేయడం మాములే కానీ బామ్మలు కూడా ఈ పాటకు రీల్స్ చేసారు. కర్ణాటక బెలగాంలో ఉన్న శాంతయి వృద్ధాశ్రమంలో ఉన్న బామ్మలు కిస్సిక్ పాటకు స్టెప్పులు వేస్తూ రీల్ చేయగా ఆ ఆశ్రమం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. దీంతో బామ్మలు వేసిన స్టెప్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పుష్ప టీమ్ కూడా ఈ వీడియో షేర్ చేసారు.
శాంతయి వృద్ధాశ్రమంలో ఉండే బామ్మలు, తాతయ్యలు చాలా యాక్టివ్ గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెగ్యులర్ గా ట్రెండ్ అవుతున్న పాటలకు బామ్మలు అందరూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన వాళ్ళు ఆ ముసలి వాళ్లకు ఇది రెండో బాల్యం అని వాళ్ళతో ఫుల్ యాక్టివ్ గా కార్యక్రమాలు చేయిస్తారు, ట్రిప్స్ కి తీసుకెళ్తారు. వారి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. శాంతి సెకండ్ చైల్డ్ హుడ్ అనే పేరుతో ఉన్న ఈ సోషల్ మీడియా అకౌంట్ కి చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.