Omicron Effect : ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ కు ఒమిక్రాన్ కష్టాలు

ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్ పెడుతుండంతో థియేటర్లు పూర్తిగా మూతపడితే భారీగా నష్టాలు తప్పవని నిర్మాతలకు దిగులు పట్టుకుంది. ఓవర్సీస్ సినిమా మార్కెట్లపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది.

Omicron Effect

Omicron Effect on RRR and Radheshyam : ప్రపంచాన్ని భయపెడుతోన్న ఒమిక్రాన్ సినీ ఇండస్ట్రీపై పడింది. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీపై ఒమిక్రాన్ భారీ దెబ్బ కొడుతోంది. పాన్ ఇండియా తెలుగు మూవీలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కట్టడి చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

మహారాష్ట్ర థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తున్నారు. నైట్ కర్ఫ్యూతో రాత్రి షోలకు రెడ్ సిగ్నల్ పడింది. థియేటర్స్ పై ఆంక్షలు విధించడంతో సినిమాల ఆక్యుపెన్సీ భారీగా పడిపోనుంది. దీంతో ఆర్ఆర్ఆర్ తో పాటు రాధేశ్యామ్ టీమ్ కు టెన్షన్ పట్టుకుంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్, సంక్రాంతి కానుకగా 14న రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి మూవీ టీమ్స్.

Akshay Kumar: టార్గెట్ 2 వేల కోట్లు.. వచ్చే ఏడాది అక్కీ ప్లానింగ్ అదిరిపోద్ది!

450 కోట్ల భారీ బడ్జెట్ తో  పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుండగా, అదే రేంజ్ 350 కోట్ల బడ్జెట్ తో రాధేశ్యామ్ రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్ పెడుతుండంతో థియేటర్లు పూర్తిగా మూతపడితే భారీగా నష్టాలు తప్పవని నిర్మాతలకు దిగులు పట్టుకుంది. ఓవర్సీస్ సినిమా మార్కెట్లపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది.

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415 చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు వేడుకలపై నిబంధనలు విధించాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిమ్, సినిమా థియేటర్లు, పబ్‌లలో 50 శాతం అక్యుపెన్సీతో మాత్రమే నడపాలని తెలిపింది.

Komuram Bheemudo Lyrics: రక్తం మరిగించే ‘కొమురం భీముడో’ పాట.. లిరిక్స్, వాటి అర్థం తెలుసుకోండి!

దేశంలో మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు కట్టడికి ప్రత్యేక దృష్టిపెట్టాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిబంధనలు విధించాయి. కాగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది.