చిరు బర్త్ డేకు ఉపాసన ఎమోషనల్ ట్వీట్

వినాయక చవితి.. మెగాస్టార్ బర్త్ డే చిరు అభిమానులకు డబుల్ బొనాంజా. చిరు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురుస్తుంది. ఆగస్ట్‌ 22న సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నాయకులు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. బహిరంగంగా వేడుకలు చేసుకోవడానికి కరోనా అడ్డు రావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు.

మెగా హీరోలు అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరణ్‌ సందేష్‌లు కూడా ఉన్నారు. ట్విటర్‌ వేదికగా చిరుతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెష్‌ చెబుతున్నారు. అన్నింటిలో ప్రత్యేకంగా నిలిచింది ఆయన కోడలు ఉపాసన ట్వీట్. ఎమోషనల్ గా చేసిన పోస్టు వైరల్ అయింది.

‘నిత్య కృషీవలుడు, గొప్ప నమ్మకం ఉన్న వ్యక్తి. దయార్థ హృదయం, క్లిష్ట సమయాల్లోనూ మానసిక ధైర్యంతో ఉండే వ్యక్తి. ఆయన్ను మామయ్య అని నేను పిలిస్తే.. ప్రపంచం మెగాస్టార్‌ అని పిలుస్తోంది’ అని ఉపాసన ట్వీట్‌ చేస్తూ.. మీరంటే స్ఫూర్తి, ఆరాధనభావం ఎప్పటికి ఉంటుందంటూ తన మామయ్య చిరంజీవికి ఉపాసన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.