One By Two : ‘ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా’.. వుమెన్ ప్రొటెక్షన్ గురించి ‘వన్ బై టు’..

డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘వన్ బై టు’..

One By Two : ‘ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా’.. వుమెన్ ప్రొటెక్షన్ గురించి ‘వన్ బై టు’..

One By Two Teaser

Updated On : July 27, 2021 / 4:13 PM IST

One By Two: డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘వన్ బై టు’. చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద, దారం ప్రభుదాస్ సమర్పణలో కరణం శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘వన్ బై టు’ టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్‌లో సాయి కుమార్‌ని చాలా పవర్ ఫుల్‌గా చూపించారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిలపై యాసిడ్ దాడులు మరియు పసిపిల్లలపై అత్యాచారం వంటి సంఘటనలకి ఇందులో చూపించిన పరిష్కారం చాలా వైల్డ్‌గా ఉంది. విజయ భారతి (సుదర్శన్ కరమల) రాసిన ‘‘ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా, నేను ఎంటరైతే విశ్వరూపమే’’ లాంటి సాలిడ్ డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. ‘వన్ బై టు’ వుమెన్ ప్రొటెక్షన్ గురించి రూపొందించిన ఓ పవర్ ఫుల్ మూవీ అని టీజర్‌తో అర్థమవుతోంది.

One By Two

 

షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీలో కూడా డబ్ చేసి థియేటర్‌లలో విడుదల చేయబోతున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

టెక్నీషియన్స్ : కో-ప్రొడ్యూసర్ – వెంకట రమణ పసుపులేటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామారావు పామరాజు, మ్యూజిక్ – లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి, డైలాగ్స్ – విజయ భారతి, కెమెరా – శంకర్ కేసరి, ఎడిటర్ – JP, లిరిక్స్ – బాలవర్ధన్ & స్వర్ణ నాయుడు, డ్యాన్స్ – కపిల్, ఫైట్స్ – శంకర్, నిర్మాత – కరణం శ్రీనివాసరావు, దర్శకత్వం – శివ ఏటూరి.