Akhanda: బాలయ్య ఫ్యాన్స్ కు ఊరట.. అదిరే ట్రీట్ వచ్చేస్తుంది
నందమూరి అభిమానులు చాలాకాలంగా బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ సినిమా అఖండ..
- Naresh Mannam
- Published On : October 31, 2021 / 04:57 PM IST
Akhanda
Akhanda: నందమూరి అభిమానులు చాలాకాలంగా బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ సినిమా అఖండ షూటింగ్ పూర్తిచేసుకుంది. సరైన సమయం చూసి గర్జించేందుకు సిద్ధమైంది. కరోనాతో షూటింగ్ గ్యాప్ రాగా.. షూటింగ్ పూర్తయ్యాక.. ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్న కుదరలేదు.
Anubhavinchu Raja: రిలీజ్ డేట్ ఫిక్స్.. రాజ్‌తరుణ్ ట్రాక్‌లో పడతాడా?
ఒక ఫెస్టివల్ మిస్సయ్యిన ఈ సినిమా మరో ఫెస్టివల్ ని టార్గెట్ చేసి దసరాకి రాలేని అఖండను దీపావళి రేస్ లో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్స్ చేసుకున్నారు. కానీ, అది కూడా కుదరలేదు. త్వరలోనే సరైన సమయం చూసుకొని వచ్చేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నాడు. అయితే, ఈలోగా అభిమానులకు ఊరట నిచ్చేందుకు మేకర్స్ ట్రీట్ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్లు, టీజర్లు దుమ్మురేపాయి.
Evaru Meelo Koteeswarulu: హాట్ సీట్ లో దేవిశ్రీ, థమన్.. ఫన్ విత్ బ్రిలియంట్!
కాగా, ఇప్పుడు రిలీజ్ గ్యాప్ లో అదిరే ట్రీట్ రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీపావళి కానుకగా చిత్ర యూనిట్ ఓ సాలిడ్ టీజర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు నయా బజ్. ఇదే నిజమైతే నిజంగానే బాలయ్య అభిమానులకు కాస్త ఊరటనిచ్చేదే. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా.. హీరో శ్రీకాంత్ విలన్ గా టర్న్ తీసుకోనున్నాడు.
