Urvashi Rautela : ఒకప్పుడు కంటెస్టెంస్ట్.. ఇప్పుడు మిస్ యూనివర్స్ జడ్జి.. రికార్డు క్రియేట్ చేసిన బాలీవుడ్ నటి
మిస్ యూనివర్శర్‌గా పోటీ చేసిన ఆమె ఇప్పుడే అదే వేదికపై జడ్జిగా వ్యవహరించడం అంటే ఎంతో గ్రేట్ అంటున్నారు అభిమానులు , ప్రేక్షకులు. అంతే కాక ఈ మిస్ యూనివర్స్..........

Oorvashi
Urvashi Rautela : ఇటీవల జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో దాదాపు రెండు దశాబాల తర్వాత ఇండియాకి మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. ఇండియాకి చెందిన హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుంది. దీంతో రాత్రికి రాత్రి హర్నాజ్ స్టార్ అయిపొయింది. అయితే ఇదే మిస్ యూనివర్స్ పోటీల్లో మరో భారతీయురాలు కూడా పాల్గొంది. కానీ కంటెస్టెంట్ గా కాదు జడ్జిగా.
2015లో భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఈ సంవత్సరం జరిగిన పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. దీంతో మరోసారి ఊర్వశి వార్తల్లో నిలిచింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఊర్వశి 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2015లో భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. దీంతో బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ. త్వరలో ఊర్వశి నుంచి తెలుగు సినిమా కూడా రాబోతుంది. ‘బ్లాక్ రోజ్’ అనే టైటిల్ తో తెలుగులో సినిమా చేస్తుంది ఊర్వశి.
Bigg Boss 5 : నువ్వేమన్నా హీరోవి అనుకుంటున్నావా?.. సన్నీని ఏకిపారేసిన సిరి
ఒకప్పుడు మిస్ యూనివర్శర్‌గా పోటీ చేసిన ఆమె ఇప్పుడే అదే వేదికపై జడ్జిగా వ్యవహరించడం అంటే ఎంతో గ్రేట్ అంటున్నారు అభిమానులు , ప్రేక్షకులు. అంతే కాక ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ ఫైనల్ కు భారత్ తరపున వెళ్లి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన అతి చిన్న వయస్కురాలిగా ఊర్వశీ రౌతేలా రికార్డ్ సృష్టించింది. తాను జడ్జిగా వ్యవహరించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Bigg Boss 5 : బిగ్‌బాస్ లో ఏం జరుగుతుందో మీకు తెలీదు.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి : యాని మాస్టర్
View this post on Instagram