Oppenheimer : ఆస్కార్ విన్నింగ్ సినిమా ఓపెన్ హైమర్.. ఇప్పుడు తెలుగులో కూడా చూడొచ్చు.. ఎక్కడంటే..?

థియేటర్స్ లోనే ఇండియన్ సినీ అభిమానులు ఓపెన్ హైమర్ ని తెగ చూసేసారు. 100 కోట్లకు పైగా ఇండియాలోనే కలెక్ట్ చేసింది ఈ సినిమా.

Oscae Winning Oppenheimer Movie Streaming Now in Telugu Also OTT Details Here

Oppenheimer : ఆస్కార్(Oscar) విన్నింగ్ సినిమా ఓపెన్ హైమర్ ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీకి వచ్చేసింది. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ప్రపంచయుద్ధంలో జపాన్ పై వేసిన అణుబాంబు తయారీ, అది చేసిన ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ ఓపెన్ హైమర్ సినిమాని తెరకెక్కించారు. ఇటీవల జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సినిమా ఏకంగా 13 విభాగాల్లో నామినేట్ అవ్వగా 7 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

ఓపెన్ హైమర్ సినిమా బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్‌, బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. మనదేశంలో ఈ సినిమా థియేటర్లో రిలీజయినప్పుడు కేవలం ఇంగ్లీష్ భాషలోనే రిలీజయింది. థియేటర్స్ లోనే ఇండియన్ సినీ అభిమానులు ఓపెన్ హైమర్ ని తెగ చూసేసారు. 100 కోట్లకు పైగా ఇండియాలోనే కలెక్ట్ చేసింది ఈ సినిమా.

Also Read : Samantha : ప్రిన్సెస్‌గా ఓడిపోయాను.. కానీ.. హాట్ ఫోటోలు షేర్ చేసి.. సమంత ఆసక్తికర పోస్ట్..

ఇక ఆస్కార్ అవార్డులు రావడంతో ఈ సినిమాని చూడాలని చాలామంది అనుకున్నారు. ఇటీవలే రెండు రోజుల క్రితమే ఓపెన్ హైమర్ సినిమా ఇండియాలో జియో సినిమా ఓటీటీలో కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు మరిన్ని భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నేడు మధ్యాహ్నం నుంచి ఓపెన్ హైమర్ సినిమా తెలుగుతో పాటలు తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో తెలుగు సినీ ప్రేమికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆస్కార్ అందుకున్న ఓపెన్ హైమర్ సినిమాని జియో సినిమా ఓటీటీలో చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు