Samantha : ప్రిన్సెస్‌గా ఓడిపోయాను.. కానీ.. హాట్ ఫోటోలు షేర్ చేసి.. సమంత ఆసక్తికర పోస్ట్..

ఇటీవల సమంత రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు కూడా షేర్ చేస్తుంది.

Samantha : ప్రిన్సెస్‌గా ఓడిపోయాను.. కానీ.. హాట్ ఫోటోలు షేర్ చేసి.. సమంత ఆసక్తికర పోస్ట్..

Samantha Shares Bold Photos and Says Failed as a Disney princess Photos Goes Viral

Updated On : March 23, 2024 / 7:56 PM IST

Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఓ పక్క తన ఆరోగ్యంపై ఫోకస్ చేస్తూనే మరోపక్క బిజినెస్ లు చూసుకుంటూ, ఇటీవలే హెల్త్ పాడ్ కాస్ట్ లు చేస్తుంది. ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చాలా యాక్టివ్ గా ఉంటుంది సమంత. ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలేవీ లేకపోయినా గతంలో చేసిన సిటాడెల్ సిరీస్ రిలీజ్ కి రెడీగా ఉంది.

ఇటీవల సమంత రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో సమంత కుర్చీలో కూర్చొని తన అందాలు ఆరబోస్తూ ఫోటోలని షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలని షేర్ చేసి.. నేను డిస్నీ ప్రిన్సెస్ గా ఓడిపోయాను, ఇప్పుడు నేను డ్రాగన్ ని అని పోస్ట్ చేసింది.

Also Read : Tollywood Stars : ఇన్‌స్టాగ్రామ్ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్ 5 టాలీవుడ్ హీరోలు వీళ్ళే.. ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్..?

దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సమంత ఎందుకు అలా పెట్టింది. గతంలో మంచిగా ఉంటే ఓడిపోయాను అని, ఇప్పుడు ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకున్నాను అనే అర్ధం వచ్చేలా పెట్టింది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే క్యాప్షన్ అదుర్స్ అన్ని, ఫోటోలు చాలా హాట్ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత మరోసారి తన హాట్ ఫొటోలతో, క్యాప్షన్ తో వైరల్ అవుతుంది.