Tollywood Stars : ఇన్‌స్టాగ్రామ్ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్ 5 టాలీవుడ్ హీరోలు వీళ్ళే.. ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్..?

మన టాలీవుడ్ హీరోల్లో టాప్ 5 ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోలు, ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా?

Tollywood Stars : ఇన్‌స్టాగ్రామ్ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్ 5 టాలీవుడ్ హీరోలు వీళ్ళే.. ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్..?

Tollywood Heros Who Having Top 5 Instagram Followers with How Many Followers Allu Arjun Prabhas Mahesh Babu Ram Charan Vijay Deverakonda

Tollywood Stars : మన హీరోలని, సెలబ్రిటీలని సోషల్ మీడియాలో ఫాలో అవుతూనే ఉంటాము. హీరోలు కూడా అభిమానులకు, ప్రేక్షకులకు దగ్గరగా ఉండటానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కొంతమంది హీరోలు చాలా యాక్టివ్ గా ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక అభిమానులు హీరోలు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ చేస్తూనే ఉంటారు. తమ హీరోకి ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండాలని కోరుకుంటారు. మాములు సెలబ్రిటీలకే మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నప్పుడు మరి హీరోలకి కూడా అంతకంటే ఎక్కువే ఉండాలిగా.

మన టాలీవుడ్ హీరోల్లో టాప్ 5 ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోలు, ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? (ఈ సమాచారం 2024 మార్చి 23 తేదీ వరకు ఉన్న గణాంకాల ఆధారంగా)

మొదట అందరికంటే ఎక్కువగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ లో 25 మిలియన్స్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇటీవలే ఈ ఫీట్ సాధించి సౌత్ లోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. అంటే దాదాపు రెండున్నర కోట్ల మంది అల్లు అర్జున్ ని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ కి మన తెలుగులో పాటు కేరళలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా పుష్ప సినిమాతో నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

Tollywood Heros Who Having Top 5 Instagram Followers with How Many Followers Allu Arjun Prabhas Mahesh Babu Ram Charan Vijay Deverakonda

ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ 21.4 మిలియన్స్ ఫాలోవర్స్ తో ఉన్నాడు. అంటే దాదాపు రెండు కోట్ల 14 లక్షల మంది ఫాలోవర్స్ విజయ్ దేవరకొండని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.

Tollywood Heros Who Having Top 5 Instagram Followers with How Many Followers Allu Arjun Prabhas Mahesh Babu Ram Charan Vijay Deverakonda

టాలీవుడ్ లో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో మూడో ప్లేస్ లో రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ ని ఇన్‌స్టాగ్రామ్ లో 21.1 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు రెండు కోట్ల 11 లక్షల మంది ఫాలో అవుతున్నారు. చరణ్ RRR తో నేషనల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాతో మరో సారి పాన్ ఇండియా వైడ్ మెప్పించనున్నాడు.

Tollywood Heros Who Having Top 5 Instagram Followers with How Many Followers Allu Arjun Prabhas Mahesh Babu Ram Charan Vijay Deverakonda

Also Read : Tollywood Stars : స్టార్ పేర్లు మార్చుకుంటున్న హీరోలు.. మొన్న అల్లు అర్జున్, నిన్న ఎన్టీఆర్, నేడు రామ్ చరణ్..

నాలుగో ప్లేస్ లో మహేష్ బాబు 13.3 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు. అంటే దాదాపు ఒక కోటి 33 లక్షల మంది మహేష్ బాబుని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. అయితే మహేష్ ఇప్పటివరకు అన్ని రీజనల్ సినిమాలు చేసి కేవలం టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. నెక్స్ట్ రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ అయితే ఫాలోవర్స్ అమాంతం పెరుగుతాయి అని అభిమానులు భావిస్తున్నారు.

Tollywood Heros Who Having Top 5 Instagram Followers with How Many Followers Allu Arjun Prabhas Mahesh Babu Ram Charan Vijay Deverakonda

ఇక ఐదో ప్లేస్ లో ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ ని ఇన్‌స్టాగ్రామ్ లో 11.7 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు ఒక కోటి 17 లక్షల మంది. అయితే ప్రభాస్ చాలా లేట్ గా, ఇటీవలే సోషల్ మీడియాలోకి వచ్చాడు. అంతేకాక ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. అందుకే ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ ఉన్నా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారని, నెక్స్ట్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్ పాపులర్ అవుతాడు, ప్రభాస్ ఇంకొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఫాలోవర్స్ బాగా పెరుగుతారని అభిమానులు భావిస్తున్నారు.

Tollywood Heros Who Having Top 5 Instagram Followers with How Many Followers Allu Arjun Prabhas Mahesh Babu Ram Charan Vijay Deverakonda

మొత్తంగా టాలీవుడ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టాప్ 5 హీరోలుగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ లు ఉన్నారు.