రంగమార్తాండలో బ్రహ్మానందం

కమెడియన్ బ్రహ్మానందం గుండెకు హత్తుకునే పాత్రలో కనిపించనున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వం చేస్తున్న రంగమార్తాండ అనే సినిమాలోని కీలక పాత్రను పోషించనున్నారు. మరాఠీ మూవీ నటసామ్రాట్ అఫీషియల్ రీమేక్‌‌ ఇది. నానా పటేకర్ పోషించిన పాత్రకు స్నేహితుడి రోల్‌లో బ్రహ్మానందం కనిపించే అవకాశాలు ఉన్నాయి.

అభిషేక్ జవకర్, మధు కలిపు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గురించి డైరక్టర్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు.