Pakeezah Vasuki Requests Help from AP Deputy CM Pawan Kalyan
Pakeezah Vasuki : సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు కొంతమంది చివరిదశలో దీన స్థితిలో బతుకు ఈడుస్తూ ఉంటారు. అలాంటివారిలో నటి పాకీజా వాసుకి ఒకరు. అసెంబ్లీ రౌడీ, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, పెదరాయుడు.. లాంటి అనేక తెలుగు, తమిళ్ సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. పాకీజా అనే క్యారెక్టర్ పేరుతో బాగా వైరల్ అయింది.
అయితే గత కొంతకాలంగా పాకీజా దీన స్థితిలో బతుకుతుంది. గతంలో మంచు విష్ణు, చిరంజీవి.. పలువురు నటీనటులు ఆమెకు సాయం చేసారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సాయం చేయమని వేడుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో పాకీజా వాసుకి మాట్లాడుతూ.. నేను పాకీజాను. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కు నమస్కారం. నేను చాలా కష్టంలో ఉన్నాను, మూడేళ్ళుగా సినిమా షూటింగ్స్, సీరియల్స్ లేవు. నా సొంత ఊరు కారైకుడిలో ఉంటున్నాను. రెండు సార్లు విజయవాడ వచ్చాను మిమ్మల్ని కలవడానికి కానీ కుదర్లేదు. నాకు తమిళనాడు ఆధార్ కార్డు ఉంది. ఏదైనా సహాయం చేసి ఆదుకోండి. నెలనెలా ఏదైనా పెన్షన్ వచ్చేలా చూడండి. నాకు పిల్లలు, మొగుడు లేరు, అనాథగా ఉంటున్నాను. ఏపీ నుంచి ఏదైనా సహాయం చేయండి మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేసారు.
మరి ఈ వీడియో ఏపీ డిప్యూటీ సీఎం, సీఎం వరకు వెళ్తుందా, వాళ్ళేమైనా సహాయం చేస్తారా చూడాలి. గతంలో తమిళనాడులో జయలలిత పార్టీ అన్నాడీఎంకేలో జాయిన్ అయి సేవలు అందించారు. కానీ జయలలిత మరణం తర్వాత ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు వృద్ధాప్య పింఛన్ లాంటిది ఏమి ఇవ్వట్లేదా అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
Also Read : Bigg Boss 9 : మీరు కూడా ఈసారి బిగ్ బాస్ లో పాల్గొనచ్చు.. ఎలా అంటే.. బిగ్ బాస్ సీజన్ 9 ఎంట్రీకి దారి ఇదే..