Imran Khan : బాలీవుడ్ నుంచే పాక్ సినిమాల్లో అశ్లీలత..! ఇమ్రాన్ ఖాన్ హాట్ కామెంట్స్..

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన ఇమ్రాన్ ఈసారి సినిమా ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసే మరోసారి వార్తల్లో నిలిచారు..

Imran Khan: మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరు ఎప్పుడూ ఏదో వివాదంలో వినబడుతూనే ఉంటుంది. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన ఇమ్రాన్ ఈసారి సినిమా ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసే మరోసారి వార్తల్లో నిలిచారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇస్లామాబాద్‌లో జరిగిన షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ సినిమా.. హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల వల్ల బాగా ప్రభావితం అయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. హాలీవుడ్, బాలీవుడ్‌ను కాపీ కొట్టడం కానీ వారి ఫిలిం మేకింగ్ విధానాన్ని ఫాలో కావడం కానీ చెయ్యొద్దని పాక్‌ ఫిల్మ్‌ మేకర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇమ్రాన్‌ ఖాన్‌.

సినిమాల్లో వల్గారిటీ అనేది హాలీవుడ్ లో స్టార్ట్ అయ్యి, అటు నుండి బాలీవుడ్ తద్వారా పాక్‌ సినిమాలకు పాకింది. ఇండియన్ సినిమా అక్కడి వారి కల్చర్‌కు పెద్దపీటవేసి చూపిస్తోంది. ఇది పరోక్షంగా మరో దేశపు కల్చర్‌ను ప్రోత్సహించడమే అవుతుంది. కాపీ కంటే ఒరిజినాలిటీకే ఎక్కువ వాల్యూ ఉంటుంది.

ఇతర దేశాలవారిని ఫాలో అవకుండా.. ఒరిజినలాటితో ఇక్కడి నేటివిటీని, మన దేశపు గొప్పదనాన్ని చూపించే ప్రయత్నం చేయండి. ఆ కోణంలో సినిమాలు తియ్యండి. సినిమాలు ఫ్లాప్ అవుతాయని భయపడకండి. ఫెయిల్యూర్‌కి భయపడితే గెలవలేం. అంటూ పాకిస్థాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి దిశా నిర్దేశం చేశారు ఇమ్రాన్ ఖాన్.

ట్రెండింగ్ వార్తలు