సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ న్యూ ఫిల్మ్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లుతో హీట్ పుట్టిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు, సాంగ్స్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. తాజాగా ఆయన పప్పు లాంటి అబ్బాయి అంటూ సాగే ఫుల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మేరకు వర్మ..ట్విట్టర్ ద్వారా టీట్ చేశారు. పరమ బ్రహ్మ ముహూర్తం..2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం 9.36 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పప్పులాంటి అబ్బాయి..శుద్ధ పప్పు చిన్నారి..బాధ నేను పడుతున్నా..చెప్పుకోలేకున్నా..అంటూ సాంగ్ సాగింది. సైకిల్ ఛైన్ తెగితే..దాని లింక్ చేస్తా..పచ్చనైన మా డాడి..సైకిల్ పట్టి వేలాడి..ఏడవద్దు..పొర్లాడి..అంటూ సాగింది.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదలైంది. ఇటీవలే కేఏ పాల్‌పై ఓ సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పప్పులాంటి అబ్బాయి అబ్బాయి సాంగ్..టీజర్‌లో తాతగారి సైకిల్ లాక్కొని తొక్కుతున్నావు..నన్ను కూడా ఎక్కి తొక్కుమంటున్నావు..నాకు అంత సరదా లేదు..నన్ను విడిచిపెట్టు..నీకు కూడా అంత వయస్సు లేదు..సైకిల్‌ను వదిలివేయవచ్చు..కదా..అంటూ సాంగ్ సాగింది. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వివాదాలు నడుస్తుండగా.. విడుదలైన ఈ సాంగ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
Read More : తెలుగులో ‘జాక్‌పాట్’ – నవంబర్ 21 విడుదల
సినిమా చూసిన తర్వాత ఎవరైనా భుజాలు తడుముకోవచ్చని, ఎవరినైనా పోలినట్లు ఉంటే అది యాదృచ్చికం మాత్రమే ప్రకటించారు వర్మ. ఇటీవలే ఆయనతో 10tv ముచ్చటించింది. క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు అని తీసిన సందేశాత్మక చిత్రం ఇది తెలిపారాయన. అయితే.. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకు పోలికలు కనిపిస్తాయని, అయితే అది యాదృచ్చికం మాత్రమే అని అన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు సామరస్యంగా ఉండాలనే మెసేజ్‌తో నిజాయితీగా తీసిన సినిమా ఇది అని స్పష్టం చేశారు వర్మ.
Here is the PAPPU LAANTI ABBAYI video song from KAMMA RAJYAMLO KADAPA REDDLU ..it’s a FATHER SON LOVE song…1st part from FATHER’s pov and 2nd part from SON’s pov .Any resemblence to anybody is purely COINCIDENTAL #PappuLaantiAbbayi # KRKR https://t.co/U9pNNOZQXh
— Ram Gopal Varma (@RGVzoomin) November 10, 2019