Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం అదిరిపోయే సబ్జెక్ట్ రెడీ చేస్తోన్న పరశురామ్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం వర్క్ షాప్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక పవన్ కోసం మరికొంత మంది డైరెక్టర్లు కూడా తమ కథలను రెడీ చేస్తూ ఆయనకు వినిపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ జాబితాలో దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Parasuram Penning A Story For Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం వర్క్ షాప్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక పవన్ కోసం మరికొంత మంది డైరెక్టర్లు కూడా తమ కథలను రెడీ చేస్తూ ఆయనకు వినిపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ జాబితాలో దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan Special Bus : పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్న బస్సు.. కార్ వాన్ తరహాలో ప్రత్యేక ఏర్పాట్లు

పవన్ కళ్యాణ్ కోసం పరశురామ్ ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నాడట. సోషల్ మెసేజ్ ఉండే ఈ కథను పవన్ కళ్యాణ్ కోసమే ఆయన రాస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని తెరకెక్కించిన పరశురామ్, ఇప్పుడు పవన్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Parasuram: స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి పరుశురామ్.. నెక్స్ట్ ఏంటి?

ఇక పరశురామ్ పవన్‌కు తన కథను ఎప్పుడు వినిపిస్తాడా.. ఈ కథకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.