Barabar Premistha : బరాబర్ ప్రేమిస్తా నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్.. ‘మళ్ళీ మళ్ళీ నీ కౌగిల్లోనే..’
మీరు కూడా ఈ మెలోడీ ప్రేమ గీతం వినేయండి.. (Barabar Premistha)
Barabar Premistha
Barabar Premistha : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మాణంలో సంపత్ రుద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Barabar Premistha)
బరాబర్ ప్రేమిస్తా సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మెలోడీ పాటను సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాన్జి చేతుల మీదుగా రిలీజ్ చేసారు.
‘మళ్ళీ మళ్ళీ నీ కౌగిల్లోనే..’ అంటూ సాగిన ఈ పాటని ఆర్ఆర్ ధ్రువన్ రాసి సంగీతం అందించగా మహమ్మద్ ఇర్ఫాన్ పాడారు. ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మీరు కూడా ఈ మెలోడీ ప్రేమ గీతం వినేయండి..
దర్శకుడు జయంత్ సి పరాన్జి పాటను విడుదల చేసిన అనంతరం.. మళ్ళీ మళ్ళీ అంటూ సాగిన ఈ పాట బాగుంది. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

Also Read : Anjali Pavan : రేపు డెలివరీ అంటే ఇవాళ కరోనా.. కూతురు పుట్టాక 19 రోజులు చూపించలేదు.. అంజలి ఎమోషనల్..
