NSD చీఫ్ గా నటుడు పరేష్‌ రావల్ నియామకం

నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(NSD) చీఫ్‌ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్‌ రావల్‌ నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా చీఫ్‌ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్‌ రావల్‌ నియమితులయ్యారు. 2017 నుంచి ఖాళీగా ఉన్న NSD చీఫ్ పదవికి పరేష్‌ రావల్‌ ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు.

పరేష్‌ రావల్‌ కు నూతన బాధ్యతలను కట్టబెట్టినట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ నిర్ధారించారు. పరేష్ రావల్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి… ఈ నియామకంతో కళాకారులు, విద్యార్ధులకు మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


పరేష్ రావల్ దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమలో ఉన్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ప్రతిష్ఠాత్మక నేషనల్ ఫిలిం అవార్డును 1994లో పొందారు. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2014లో ఆయనను భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో గౌరవించింది.

సినిమాలతో పాటు నాటక రంగంలోనూ పరేష్‌ రావల్‌ చురుకుగా ఉండేవారు. సినిమాల కంటే నాటకాలనే తాను అమితంగా ప్రేమిస్తానని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ..కాగాపరేష్ రావల్ తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమే. తెలుగులో పలు సినిమాల్లో పరేష్ రావల్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే.


పరేష్ రావల్ బీజేపీ మాజీ ఎంపీ కూడా. 2014 లోక్ సభ ఎన్నికల్లో అహ్మదాబాద్ తూర్పు స్టానం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అయన 3. లక్షల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే .