Mr.Celebrity : హీరోగా పరిచయం అవుతున్న పరుచూరి బ్రదర్స్ మనవడు.. ‘మిస్టర్ సెలబ్రిటీ’ టీజర్ చూశారా?

తాజాగా మిస్టర్ సెలబ్రిటీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

Paruchuri Brother Grand Son Paruchuri Sudarshan as Hero Mr Celebrity Movie Teaser Launch Event

Mr.Celebrity Teaser : టాలీవుడ్ సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ రచయితలుగా, నటులుగా ఎన్నో హిట్ సినిమాలు చేసారు. ఇప్పుడు వాళ్ళ మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పరుచూరి సుదర్శన్ హీరోగా ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే సినిమా రానుంది. N పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్త నిర్మాణంలో ఆర్‌పి సినిమాస్ బ్యానర్ పై రవి కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Mokshagna – Prasanth Varma : ‘సింబ’ వస్తున్నాడు.. మోక్షజ్ఞపై ప్రశాంత్ వర్మ ఆసక్తికర ట్వీట్..

తాజాగా మిస్టర్ సెలబ్రిటీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పరుచూరి బ్రదర్స్ హాజరయ్యారు. టీజర్ లో.. రామాయణ కాలంలో చాకలి వాడు అన్న పుకార్ల మాటలకు సీతాదేవీ అరణ్య వాసం, అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది.. కాలం మారింది కానీ ఈ పుకారు మాటల వల్ల పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉన్నాయి అనే ఆసక్తికర డైలాగ్ తో టీజర్ మొదలైంది. యాక్షన్, సస్పెన్స్, క్రైం అంశాలతో ఈ సినిమా ఉండబోతున్నట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. మీరు కూడా టీజర్ చూసేయండి..

 

టీజర్ లాంచ్ ఈవెంట్లో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నేను, తమ్ముడు కలిసి ఈ సినిమా చూశాం. సాధారణంగా హీరోల కొడుకులు హీరోలు అవుతారు. కానీ మా మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మేము చిరంజీవి ఖైదీ సినిమాలో.. పగ తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తాను.. ప్రేమ కోసం ఇంకో జన్మ ఎత్తుతాను అని సింగిల్ లైన్‌లో చెప్పాం. ప్రేక్షకుడు ఊహించింది జరగాలి.. కానీ ఊహించని టైంలో జరగాలి. ఇవన్నీ ఈ సినిమాలో జరుగుతాయి. సెలెబ్రిటీల మీద వచ్చే రూమర్లను ఆధారంగా తీసుకొని కథ రాసుకొని రవి కిషోర్ ఈ సినిమాను బాగా తీసాడు ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.

హీరో పరుచూరి సుదర్శన్ మాట్లాడుతూ.. మిస్టర్ సెలెబ్రిటీ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా వస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను హీరో అవుతానని చెప్పినప్పుడు మా తాత గారు నాకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఎవ్వరికీ నా గురించి చెప్పకుండా జూనియర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో పని చేశాను. సినిమా కష్టాలను చూసాను. ఈ కథే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మా తాత గారికి చెప్తే ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించు అన్నారని తెలిపారు.

డైరెక్టర్ రవి కిషోర్ మాట్లాడుతూ.. మిస్టర్ సెలెబ్రిటీ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ఒక ప్రయోగాత్మక సినిమా. సుదర్శన్ గారికి కథ చెప్పినప్పుడు బాగుందని అన్నారు. పరుచూరి గారికి కూడా స్క్రిప్ట్ చెప్పాము, చిన్న చిన్న కరెక్షన్స్ చేశారు. నిర్మాత మాకు ఏం కావాలో అది ఇచ్చారు. సాధారణ వ్యక్తి నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బంది పడే ఓ సమస్యని ఈ సినిమాలో చూపించాను. చిన్న సమస్యలే కదా, చిన్న మాటలే కదా.. అనుకునేవి ఎంత ప్రభావం చూపిస్తాయో చూపించాము. సినిమా క్లైమాక్స్ డిఫరెంట్‌గా ఉంటుందని అన్నారు.

నిర్మాత చిన్న రెడ్డయ్య మాట్లాడుతూ.. సుదర్శన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. పరుచూరి వారి ఇంటి వ్యక్తిని హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. మిస్టర్ సెలెబ్రిటీ టైటిల్‌లోనే పాజిటివిటీ ఉంది. తెలిసింది మాట్లాడితే స్వేచ్చ.. తెలియంది మాట్లాడితే నేరం.. తెలిసింది నిజం అనుకుని మాట్లాడటం పొరపాటు.. తెలుసు అనుకుని మాట్లాడటం మహా పాపం.. ఇలాంటి మంచి పాయింట్‌తో సినిమాను తీశారు. సుదర్శన్ నా గురువు గారి మనవడు. నేను కూడా సుదర్శన్‌తో ఒక సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా ప్రకటన వస్తుంది అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు