Mokshagna – Prasanth Varma : ‘సింబ’ వస్తున్నాడు.. మోక్షజ్ఞపై ప్రశాంత్ వర్మ ఆసక్తికర ట్వీట్..
తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Prasanth Varma Tweet on Balakrishna Son Mokshagna Entry like Simba
Mokshagna – Prasanth Varma : బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ కొత్త లుక్స్ బయటకు వచ్చి వైరల్ అయ్యాయి, మోక్షజ్ఞ సత్యానంద్ వద్ద నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని చెప్పారు. దీంతో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరో ఎంట్రీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
Also Read : Jr NTR : తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. దేవర భారీ విరాళం.. ఎంతో తెలుసా?
తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సింహం తన కొడుకు సింబని పరిచయం చేస్తున్న యానిమేటెడ్ సినిమా ఫోటో షేర్ చేసి.. సింబ వస్తున్నాడు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకే వస్తున్నాడు అని పోస్ట్ చేసాడు. బాలయ్యని అందరూ సింహంతో పిలుస్తారని తెలిసిందే. సింహం తనయుడు సింబ మోక్షజ్ఞ అని అర్ధం వచ్చేలా ప్రశాంత్ వర్మ ఈ ట్వీట్ చేసాడని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
A new dawn is breaking at @ThePVCU!#SimbaisComing 🦁 pic.twitter.com/Kr91AkRil2
— Prasanth Varma (@PrasanthVarma) September 3, 2024
దీంతో మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి అది ప్రశాంత్ వర్మ దర్హకత్వంలోనే ఉంటుందా అనేది చూడాలి. మొత్తానికి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇండైరెక్ట్ గా ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.