Pathaan Creates Sensation At Box Office With Pre-Sales
Pathaan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో మనం చూస్తున్నాం. ఈ సినిమాపై క్రేజ్ కంటే కూడా ఎక్కువగా వివాదాలే ఉండటంతో అందరి చూపు ఈ సినిమాపై పడింది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు పూర్వవైభవం తీసుకురావాలి కింగ్ ఖాన్ భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన సిక్స్ ప్యాక్ లుక్‌లో మరోసారి అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు రెడీ అయ్యాడు.
Pathaan : పఠాన్ సినిమాని రిలీజ్ కానివ్వం.. భజరంగ్ దళ్ హెచ్చరిక!
కాగా ఈ సినిమాను జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండటంతో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా అడ్వాన్స్ టికెట్లు విక్రయానికి పెట్టారు. ఈ క్రమంలో కేవలం 5 గంటల్లోనే కోటి రూపాయల మేర టికెట్ల విక్రయం జరిగినట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా, ఈ సినిమాను స్పై థ్రిల్లర్‌గా భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో చిత్ర యూనిట్ రూపొందించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
షారుక్‌తో పాటు ఈ సినిమాలో మరో హీరో జాన్ అబ్రహం కూడా నటిస్తుండగా, వారిద్దరి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లు నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఈ సినిమాలో అందాల భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తుండగా, యశ్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా అన్ని చోట్లా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయకుండానే పఠాన్ ఈ తరహాలో సందడి చేస్తుండటంతో, మున్ముందు షారుక్ ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.