Pathaan: సెన్సార్ ముగించుకున్న పఠాన్.. రన్‌టైమ్ ఎంతంటే..?

యావత్ బాలీవుడ్ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్ ఖాన్ షారుక్ ‘పఠాన్’ సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులే సమయం ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న పఠాన్, తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Pathaan Movie Completes Censor Work And Locks Runtime

Pathaan: యావత్ బాలీవుడ్ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్ ఖాన్ షారుక్ ‘పఠాన్’ సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులే సమయం ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న పఠాన్, తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Pathaan: 5 గంటల్లోనే కోటి రూపాయలు.. ప్రీ-సేల్స్‌తో దుమ్ములేపిన పఠాన్

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాలో వివాదానికి కారణమైన పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ మేరకు కొన్ని క్లోజన్ షాట్స్, కొన్ని లైన్స్‌ను మార్చాలని చిత్ర యూనిట్‌ను ఆదేశించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. పఠాన్ సినిమాను 2 గంటల 26 నిమిషాల 16 సెకన్లకు లాక్ చేసింది చిత్ర యూనిట్.

Pathaan : పఠాన్ సినిమాని రిలీజ్ కానివ్వం.. భజరంగ్ దళ్ హెచ్చరిక!

ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని బాలీవుడ్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ తమ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసేందుకు రెడీ అయ్యారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ మూవీలో యాక్షన్ డోస్‌కు కొదువే లేదని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో జాన్ అబ్రహాం కూడా నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.