టచ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు.. ఇది నాకెంతో ప్రత్యేకం!

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 05:39 AM IST
టచ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు.. ఇది నాకెంతో ప్రత్యేకం!

Updated On : January 14, 2020 / 5:39 AM IST

అల్లు అర్జున్, పూజా హగ్డే కలిసి నటించిన సినిమా ‘అలా వైకుంఠపురములో’. ఈ సినిమా సంక్రాంతికి రిలీజై.. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సంధర్భంగా బన్నీకి సోషల్ మీడియాలో స్టార్ హీరోల నుంచి శుభాకాంక్షలు వెల్లువెతున్నాయి.

ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సహా పలువురు నటులు బన్నీని అభినందించగా.. లేటెస్ట్‌గా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అలా వైకుంఠపురములో సినిమా సక్సెస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఫ్లవర్ బొకేను పంపించారు. ఫ్లవర్ బొకేతో పాటు ఒక లెటర్ కూడా పంపించారు.

ఆ లెటర్ లో ఉన్న విషయాన్ని బన్నీ ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. బన్నీకి పంపిన ఆ లెటర్ లో గౌరవనీయులైన అల్లు అర్జున్ గారు, అలా వైకుంఠపురం సినిమా చాలా బాగా సక్సెస్  సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మీరు చేయబోయే సినిమాలకు ఆల్ ది బెస్ట్ అంటూ రాసి పంపారు.

ఆ లెటర్ చూసి స్పందించిన బన్నీ, పవన్ కళ్యాణ్ గారి నుంచి శుభాకాంక్షలు రావటంతో తనకి ఎంతో సంతోషంగా ఉందని.. ఇది నాకెంతో ప్రత్యేకం అని అన్నారు. థ్యాంక్యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు.. మీ విషెస్‌తో నా హార్ట్ టచ్ చేశారు. అంటూ ట్వీట్ చేశాడు బన్నీ.