Pawan Kalyan Allu Arjun : సినిమా హీరోల కోసం ఫ్యాన్స్ తిట్టుకోవడం, కొట్టుకోవడం మన ఇండియాలో మాములే. కానీ అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ విషయంలో కొత్తగా జరిగింది. మెగా ఫ్యాన్స్ నుంచి అల్లు ఫ్యాన్స్ సపరేట్ అయి వీళ్ళిద్దరూ ఫ్యాన్ వార్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. హీరోలంతా మేము మేము బాగానే ఉంటాము అని అనేక సందర్భాల్లో చెప్పినా ఫ్యాన్స్ మాత్రం పట్టించుకోరు.(Pawan Kalyan Allu Arjun)
ఎన్టీఆర్ – చరణ్ ఎంత క్లోజ్ అనేది RRR సినిమా ప్రమోషన్స్ లో చూసాం. కానీ రిలీజ్ తర్వాత మా అహీరో మెయిన్ మా హీరో మెయిన్ అని కొట్టుకున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ – మహేష్ క్లోజ్ అని వాళ్ళే స్టేజిపై చెప్పారు. చిరంజీవి – బాలకృష్ణ – వెంకటేష్ ఒకే స్టేజిపైకి వచ్చి ఒకరి గురించి ఒకరు ఇటీవలే గొప్పగా చెప్పారు. నాకు బాలయ్యతో కలిసి సినిమా తీయాలని ఉందని చిరంజీవి అన్నారు. ఇలా అందరి హీరోలు కలిసిమెలిసి ఉంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాదులాడుకుంటారు.
Also Read : Pawan Kalyan Birthday : తమ్ముడి పుట్టిన రోజు.. అదిరిపోయే ఫోటో షేర్ చేసి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్..
ఫ్యాన్ వార్స్
ఈ ఫ్యాన్ వార్స్ లో గత రెండు మూడేళ్ళుగా పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అప్పుడెప్పుడో అల్లు అర్జున్ ఓ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పను బ్రదర్ అని అనడంతో అక్కడ మొదలయింది. పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై, అతని ఫ్యాన్స్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ నాయకుడు తన ఫ్రెండ్ అని అక్కడికి వెళ్లి మరీ ప్రచారం చేయడంతో జనసేన పవన్ పార్టీ ఉన్నా బన్నీ వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేసాడని ఈ ఫ్యాన్ వార్స్ ఎక్కువ అయింది. అప్పట్నుంచి పవన్ – బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకోవడం, వాళ్ళ హీరోలను కించపరచడం చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది.
ఆ ఎన్నికల సమయం నుంచి తర్వాత పవన్ – బన్నీ ఇద్దరూ కలిసి కనపడలేదు. బన్నీ ఎక్కడా ఏ ఈవెంట్లోనూ పవన్ పేరు చెప్పలేదు. పవన్ మాత్రం తన పొలిటికల్ స్పీచ్ లలో హీరోల పేర్లు వస్తే అల్లు అర్జున్ పేరు కూడా కలిపి చెప్పేవాడు. ఇదే అదును చూసుకొని పవన్ రాజకీయ వ్యతిరేకులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకొని పవన్ మీద, మెగా ఫ్యామిలీ మీద, వాళ్ళ సినిమాల మీద మరింత ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. ఇది నిజమే అనుకోని పవన్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ ఫ్యాన్ వార్స్ వల్ల గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు, మట్కా సినిమాలు భారీగా ఎఫెక్ట్ అయ్యాయి.
Also See : Pawan Kalyan Rare Photos : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ రేర్ ఫొటోలు చూశారా..?
కట్ చేస్తే చాలా రోజుల తర్వాత పవన్ – అల్లు అర్జున్ కలిసి కనిపించారు. ఇటీవల అల్లు అర్జున్ నానమ్మ చనిపోవడంతో చిరంజీవి, చరణ్ తో సహా మెగా ఫ్యామిలీ అంతా అల్లు వారింట్లోనే ఉండి అన్ని చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించడమే కాక వెళ్లి అల్లు అరవింద్, అల్లు అర్జున లను పరామర్శించాడు. దీంతో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసిన వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. కష్టం వస్తే వాళ్లకు వాళ్ళు నిల్చుంటారు, వేరే ఎవరూ రారు అని, ఇప్పటికైనా ఫ్యాన్స్ మారాలి అని పలువురు నెటిజన్లు పోస్ట్ చేసారు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు
తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో దిగిన స్పెషల్ ఫోటో షేర్ చేసి పవర్ స్టార్, డిప్యూటీ సీఎం అంటూ స్పెషల్ విషెస్ చెప్పాడు. దీంతో బన్నీ పోస్ట్ వైరల్ గా మారింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఈ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పోస్టులు పెట్టారు. బన్నీ కోసం పవన్ వెళ్లారు, పవన్ కోసం బన్నీ విషెష్ చెప్పాడు. ఎప్పటికైనా వాళ్లంతా ఒకటే ఫ్యామిలీ, ఎంత కాదన్నా వాళ్లిద్దరూ మామ – అల్లుడు. వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో ఫ్యాన్స్ అర్ధం చేసుకోవాలి అని సినిమా లవర్స్, నెటిజన్లు అంటున్నారు.
మరి డైరెక్ట్ గా పవన్, బన్నీనే వారి మధ్య బంధాన్ని ఇలా చూపిస్తుంటే ఇప్పటికైనా ఫ్యాన్స్ తెలుసుకొని ఫ్యాన్ వార్స్ ఆపుతారా? ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేయడం, సినిమాల గురించి నెగిటివ్ చేయడం ఆపుతారా చూడాలి. మెగా – అల్లు ఫ్యాన్స్ వేరు కాదు అందరూ ఒకటే అని మరోసారి చూపిస్తారా చూడాలి.
Heartfelt Birthday Wishes to our Powerstar & Deputy CM @PawanKalyan garu pic.twitter.com/JGfBN1eU3M
— Allu Arjun (@alluarjun) September 2, 2025