Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్డేట్.. మరోసారి చరిత్రను తిరగరాద్దాం..
హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) అనే చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 2, 2023 / 08:53 PM IST
Ustaad Bhagat Singh update
Ustaad Bhagat Singh update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అటు రాజకీయాలు, ఇటు వరుస చిత్రాల షూటింగ్స్‌తో యమా బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) అనే చిత్రంలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘గబ్బర్ సింగ్’ సినిమా తరువాత పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా శ్రీలీల (SreeLeela) కథానాయిక. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ అప్డేట్ను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ షూటింగ్ త్వరలో మొదలు కానున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఓ భారీ సెట్‌ను ఇందుకోసం సిద్దం చేస్తున్నట్లు చెప్పింది. ఈ షెడ్యూల్లో పవన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఫస్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను పోస్ట్ చేసింది. మరోసారి చరిత్రను తిరగరాద్దాం అంటూ రాసుకొచ్చింది.
Ileana : ప్రియుడి ఫోటోని పోస్ట్ చేసిన ఇలియానా.. బిడ్డ పుట్టాక అయినా చూపిస్తావా అంటూ..
Catherine Tresa : కేథరిన్ థ్రెసాతో జార్జ్ రెడ్డి హీరో.. భారీ యాక్షన్ థ్రిల్లర్
కొన్ని విషయాలు, కొన్ని అనుబంధాలు ఎప్పటికీ మారవు అంటూ పవన్-హరీష్ శంకర్ లు గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్స్‌లోని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమాలోనూ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అంతేకాకుండా సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ చిత్రంలో, సాయి ధరమ్ తేజ్ కలిసి ‘బ్రో’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ‘బ్రో’ సినిమా షూటింగ్‌ను పవన్ పూర్తి చేశారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prabhas : ప్రాజెక్ట్ Kలో మహా విష్ణువు అవతారంలో కనిపించనున్న ప్రభాస్..!
