Ustaad Bhagat Singh : పవన్‌తో శ్రీలీల మాస్ డాన్స్ నెంబర్.. ‘పిల్ల నువ్వు లేని జీవితం’ సాంగ్ రిపీట్ చేస్తారా?
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ అండ్ శ్రీలీల కలిసి మాస్ బీట్ కి డాన్స్ వేయనున్నారు. కన్‌ఫార్మ్ చేసిన హరీష్ శంకర్.
- gum 95921
- Published On : April 14, 2023 / 02:36 PM IST
Pawan Kalyan and Sreeleela mass dance number in Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్టుగా కొట్టి పవన్ అభిమానులకు ఒక మర్చిపోలేని బహుమతిగా నిలిచింది. ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూడగా, ఇప్పటికి నెరవేరింది. గబ్బర్ సింగ్ లో పవన్ చెప్పిన పంచ్ డైలాగ్స్ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో పవన్ మాస్ డాన్స్ మరో ఎత్తు. అంతకి ముందు సినిమాల్లో పవన్ కేవలం ఒకటి రెండు పాటల్లో మాత్రమే స్టెప్పులు వేసి అలరించేవాడు.
Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ OG రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?
కానీ గబ్బర్ సింగ్ లో మాత్రం ప్రతి సాంగ్ కి డాన్స్ వేసి ఆడియన్స్ ని ఉర్రూతలూగించాడు. ముఖ్యంగా పిల్లా నువ్వు లేని జీవితం సాంగ్ లో పవన్ డాన్స్ మూవ్స్ సూపర్ అంతే. ఆ సినిమా తరువాత పవన్ మళ్ళీ ఆ రేంజ్ లో డాన్స్ చేయలేదు. కాగా ప్రస్తుతం ఉస్తాద్ లో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. శ్రీలీల అందం, నటనతోనే కాదు తన డాన్స్ తో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల ధమాకా సినిమాలో అమ్మడి డాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారు. దీంతో తాజాగా ఒక నెటిజెన్ ట్విట్టర్ వేదికగా హరీష్ శంకర్ ని ఒక రిక్వెస్ట్ కోరాడు.
”ఏదో రకంగా పవన్ అండ్ శ్రీలీలతో ఒక మాస్ స్టెప్ ట్రై చెయ్యి అన్న” అంటూ ట్వీట్ చేశాడు. దీనికి హరీష్ శంకర్ ఓకే అంటూ బదులిచ్చాడు. ఈ రిప్లై తో మళ్ళీ ‘పిల్ల నువ్వు లేని జీవితం’ వంటి మాస్ నెంబర్ చూడడం ఖాయం అంటూ అభిమానులు సంతోష పడుతున్నారు. మరి ఈ మాస్ కాంబినేషన్ కి దేవిశ్రీ ప్రసాద్ ఎటువంటి మాస్ బీట్ ఇస్తాడో చూడాలి.
— Harish Shankar .S (@harish2you) April 14, 2023
