Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. మంత్రిగా తన శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. మారుమూల గ్రామాలకు కూడా కనీస అవసరాలను తీరుస్తున్నారు. తాజాగా పవన్ తన నియోజకవర్గం పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.(Pawan Kalyan)
పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న పవన్ అక్కడ ప్రజలతో కూడా మాట్లాడారు. రాజకీయాలు, అభివృద్ధి, పండగ గురించి మాట్లాడిన అనంతరం చివర్లో ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురంలో ఇండియాలోనే అత్యున్నత మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళల అకాడమీని పెట్టాలని నిర్ణయించుకున్నా. దాంతో పాటు ఫైన్ ఆర్ట్స్ కూడా పెడుతున్నాను. దాని కోసం ప్లానింగ్ వర్క్ జరుగుతుంది. మార్షల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ కలిసి పెట్టబోతున్నాను. ఇది నా ట్రస్ట్ ద్వారా జరగనుంది. నేను స్వయంగా పెట్టబోతున్నాను. ఇది మీతో చెప్పి ఈ కొత్త సంవత్సరంలో మొదలుపెడదాము అనుకున్నాను అని తెలిపారు.
దీంతో పవన్ కామెంట్స్ పై పిఠాపురం ప్రజలతో పాటు ఫ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ నిపుణులు, ఆసక్తి ఉన్నవాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని తన సొంత నిర్మాణ సంస్థ ని ప్రకటించి మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఏదో పెద్దగానే రాబోతుందని హింట్ ఇచ్చారు. నేడు అధికారికంగా మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Dear Astronaut : 11 ఏళ్ళ తర్వాత హీరో హీరోయిన్స్ గా నటించబోతున్న భార్యాభర్తలు.. లిప్ కిస్ తో పోస్టర్ రిలీజ్..
ఇప్పటికే పవన్ తన నియోజకవర్గం పిఠాపురాన్ని దగ్గరుండి మరీ అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఇక ఇండియాలోనే బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ వస్తే పిఠాపురం రూపురేఖలు మరింత మారనున్నాయి అని అభిప్రాయపడుతున్నారు.