×
Ad

Lala Bheemla Song : ఊపు ఊపుతున్న సాంగ్.. త్రివిక్రమ్‌ లిరిక్స్ విన్నారా!

ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం..

  • Published On : November 7, 2021 / 01:02 PM IST

Lala Bheemla Song

Lala Bheemla Song: ‘‘లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవ పడి.. ఒడిసి పట్టు.. దంచి కొట్టు.. కత్తి పట్టు.. అదరగొట్టు’’ అంటూ ‘భీమ్లా నాయక్‘ పోరాట గీతానికి అదిరిపోయే లిరిక్స్ రాశారు స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్..

TABU : ఆ హీరో వల్లే టబు పెళ్లి చేసుకోలేదంట!

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు..

Vijay Deverakonda : బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా..

‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి మరో గీతం విడుదల అయింది. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేస్తుందీ గీతం.

Puneeth Rajkumar : ‘నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా’..

‘‘పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు.. పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు..’’ అంటూ సాగే పాటలోని ఈ పదాలు వింటే నిజమనిపించక మానదు. ‘భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం ఆవేశాన్ని రగిలిస్తే, రెండు నిమిషాల ముప్ఫై సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.

Ira Khan : స్టార్ హీరో కూతురు సెగలు పుట్టిస్తుందిగా..

‘భీమ్లా నాయక్‘ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.