TABU : ఆ హీరో వల్లే టబు పెళ్లి చేసుకోలేదంట!

తాను పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోవడానికి కారణమైన ఆ స్టార్ హీరో పశ్చాత్తాప్పడాలంటోంది టబు..

TABU : ఆ హీరో వల్లే టబు పెళ్లి చేసుకోలేదంట!

Tabu

Updated On : November 6, 2021 / 6:18 PM IST

TABU: ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లో ఒక ఊపు ఊపింది సీనియర్ నటి, హైదరాబాదీ టబు.. తెలుగులో వెంకటేష్ ‘కూలీ నెం.1’ తో ఎంట్రీ ఇచ్చి తర్వాత తమిళ్, హిందీ, మలయాళం భాషల్లూనూ సినిమాలు చేసి బాలీవుడ్‌లో సెటిలైపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful)

టబు ఎప్పుడు మీడియా కంట పడినా ఫస్ట్ అడిగే ప్రశ్న.. ‘మీ పెళ్లెప్పుడు’ అని.. 50 ప్లస్ అయినా ఇంకా సింగిల్‌గానే ఉంటుందామె. పెళ్లి గురించి గతంలో రకరకాల వార్తలు వచ్చాయి కానీ టబు సైలెంట్‌గా ఉండిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful)

ఇంతకుముందు ఓ ఇంటర్వూలో ఒక హీరో గురించి తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానని టబు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ తనకు 15 సంవత్సరాల వయసు నుండే పరిచయమట.

Tabu Ajay

తన బ్రదర్ ఫ్రెండ్ అవడంతో అజయ్ తరచూ ఇంటికి వస్తుండేవాడని.. కొన్నాళ్లకి తన వెంట పడడం స్టార్ట్ చేసాడని.. తనతో అబ్బాయిలెవరైనా మాట్లాడడానికి ట్రై చేస్తే ఊరుకునేవాడు కాదని.. ఇబ్బంది పెడితే వాళ్లతో గొడవ పడేవాడని.. తాను ఎక్కడికెళ్తున్నానో కనుక్కుని మరీ వెనకాల ఫాలో అయ్యేవాడని.. అజయ్ వల్లనే తాను పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోయానని దీనికి అతను పశ్చాత్తాప్పడాలని అంది.

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful)

టబు – అజయ్ కలిసి ‘విజయ్ పథ్’, (Vijaypath) ‘హకీకత్’ (Haqeeqat), ‘గోల్ మాల్ ఎగైన్’ (Golmaal Again), ‘దృశ్యం’ (Drishyam), ‘దే దే ప్యార్ దే’ (De De Pyaar De) సినిమాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.