Pawan Kalyan Celebrations with his Family Pawan Mother Anjana Happy Tears
Pawan Kalyan Mother : ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడమే కాక జనసేన తరపున నిల్చున్న 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలు గెలిచారు. దీంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పవన్ కు అన్నివైపులా నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల్లో గెలిచాక మొదటిసారి పవన్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు.
పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లగా మెగా ఫ్యామిలీ అంతా పూలు జల్లి స్వాగతం తెలిపారు. పవన్ చిరంజీవి కాళ్లకు నమస్కరించాడు. చిరంజీవి పవన్ ని హత్తుకున్నాడు. చిరంజీవి పవన్ కు పెద్ద గజమాల వేసి పూల గుచ్చం ఇచ్చి స్వాగతం తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనమ్మ, తన వదిన సురేఖలకు కూడా పాదభివందనం చేశాడు.
Also Read : Chiranjeevi – Pawan Kalyan : చిరంజీవి కాళ్లకు నమస్కరించిన పవన్.. తమ్ముడి విజయంపై ఆనంద భాష్పాలతో మెగాస్టార్
పవన్ విజయంతో తల్లి అంజనా దేవి కన్నీళ్లు పెట్టడంతో పవన్ ప్రేమగా హత్తుకున్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా కొడుకు గెలిస్తే అమ్మ సంతోషం ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ అంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చిరంజీవి భార్య సురేఖ పవన్ కి, అకిరాకు, అన్నా లేజనోవాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చింది.