Chiranjeevi – Pawan Kalyan : చిరంజీవి కాళ్లకు నమస్కరించిన పవన్.. తమ్ముడి విజయంపై ఆనంద భాష్పాలతో మెగాస్టార్

పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి అన్నయ్య మెగాస్టార్ ఇంటికి వెళ్లారు.

Chiranjeevi – Pawan Kalyan : చిరంజీవి కాళ్లకు నమస్కరించిన పవన్.. తమ్ముడి విజయంపై ఆనంద భాష్పాలతో మెగాస్టార్

Pawan Kalyan Meets Megastar Chiranjeevi after Winning in AP Elections Emotional Video goes Viral

Updated On : June 6, 2024 / 5:56 PM IST

Chiranjeevi – Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడమే కాక జనసేన తరపున నిల్చున్న 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలు గెలిచారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పవన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల్లో గెలిచాక పవన్ ఇప్పటికే చంద్రబాబుని, నరేంద్రమోదీని కలవగా తాజాగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు.

Also Read : Akira Nandan : పవన్ కొడుకు అకిరా నందన్ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఇవే.. అకిరా ఎడిటింగ్స్ అదిరిపోయాయిగా..

పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి అన్నయ్య మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. మెగా ఫ్యామిలీ అంతా పూలు జల్లి స్వాగతం తెలిపారు. అన్నయ్యను చూడగానే పవన్ చిరంజీవి కాళ్లకు నమస్కరించాడు. చిరంజీవి ఆనందభాష్పాలతో పవన్ ని హత్తుకున్నాడు. అనంతరం చిరంజీవి భార్య సురేఖ పవన్ కి, అకిరాకు, అన్నా లేజనోవాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. పవన్ తన తల్లి అంజనా దేవిని హత్తుకున్నారు. చిరంజీవి పవన్ కు పెద్ద గజమాల వేసి పూల గుచ్చం ఇచ్చి స్వాగతం తెలిపారు. మెగా ఫ్యామిలీ అందరూ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.